నటి మాధవీలత టీవీ9 చర్చాకార్యక్రమంలో సంచలన విషయాలు బయటపెట్టారు. తెలుగు సినీరంగంలో మహిళా ఆర్టిస్టులకు జరుగుతోన్న అవమానాలకి ఆ విషయం ఒక పరాకాష్టగా చెప్పుకోవాలేమో.. విషయం ఏంటంటే.. ”తాను ‘అతిధి’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నానని.. మేకప్ ఆలస్యం కావడంతో షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లానని.. అయితే, ఎందుకు లేట్ గా వచ్చావ్.. హీరోగారు నీకోసం వెయిట్ చేయాలా అని తీవ్ర స్వరంతో మాట్లాడారని, అయితే, తాను ఎందుకు ఆలస్యం అయిందో చెప్పే ప్రయత్నం చేశానని అదేమీ వినకుండా ఏంటీ.. ఎక్కువ సమాధానాలు చెప్తున్నావ్.. దెం…య్ ఇక్కడ్నుంచి అన్నాడని చెప్పింది. అలాంటి మాటలు మాట్లాడితే తాను చేయనని అంటే.. ఏయ్… దెం.. స్తే.. దెం..య్ అంటూ మళ్లీ అలాగే మెగా ఫోన్ లో గట్టిగా అన్నాడు.

తనకు బూతులు మాట్లాడితే అస్సలు నచ్చదని, మంచిగా మాట్లాడితే తానూ మంచిగా మాట్లాడతానని, లేదంటే మాటకు మాట చెప్పే మనస్తత్వం తనదని చెప్పింది. అతను అంత బూతు మాట్లాడితే, అక్కడే ఉన్న హీరో మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పింది. ఏంటామాట..? ఆడపిల్లని అలా అనొచ్చా..? ఎందుకలా అన్నారు? అని నోరెత్తొచ్చుగా అంటూ మాధవీలత.. మహేష్ బాబుని ప్రశ్నించారు. తన ఎదురుగానే ఇలాంటి ఘటనలు జరిగితే పట్టించుకోని మన హీరోలు ఎక్కడో జరిగిన దానికి ఏలా స్పందిస్తారంటు మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది.