చికాగో సెక్స్ రాకెట్ విషయంలో తనపై వస్తున్న వ్యాఖ్యలకు  టాలీవుడ్ నటి మాధవీలతపై ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యాఖ్యలకు ఆమె ఫేస్ బుక్ పోస్టు ద్వారా స్పందించారు. సంస్కారం లేని వాళ్లే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఆమె మాటల్లోనే చదవండి...
 
"ఇది కేవలం సంస్కారం లేని వాళ్ళకి మాత్రమే :-
వినేవన్నీ నిజాలు కావు బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు ....
ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన సోమరులు మీరు
చావండీ
ఆడవాళ్ల అత్మనీ చంపి.. ఆ శవమ్ మీద చిల్లరేరుకునే ముఖాలూ..
మనసే లేని మృగాలు మలినమైన అంతరాత్మలు మీరు.

ఫేస్ బుక్‌లోనూ,
యూట్యూబ్‌లోనూ
తెగ బలిసిన కుక్కల వాగుడుకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రతి వాడి చుట్టూ తిరిగి నేను మంచిదాన్ని అని సర్టిఫికేట్ తెచ్చుకోను.
అక్కర్లేదు... అన్నిచోట్లా అన్నీ ఉంటాయి.
వేటిని ఆపడం సాధ్యం కాదు. తెలిసిన మన పని మనం చేసుకుని బురదలో నేనెందుకు పడటం అని జాగ్రత్తగా వెళిపోవడం తప్ప.
ఆపడానికి నేను సీఎం కాదు పీఎం కాదు జస్ట్ ఏ కామన్‌ గర్ల్‌...
ఇప్పుడు నా ఫేస్‌బుక్‌లో నన్ను బూతులు తిడుతున్న చెత్త నా డ్యాష్ గాళ్లకి సమాధానం చెప్పే అవసరం నాకు లేదు.
నువ్ వచ్చావా???
నువ్ చూశావా???
నువ్ ఉన్నావా???
వీటికి దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి.
సో కథలు విని అదే నిజం అనుకుంటే నేను కథలు చాలా చెప్తాను...
చదువుకున్నారు.. నీ బతుకు ఏంటి.. నీ అవసరం ఏంటి.. నీ జాబ్ ఏంటి.. నీ ఫ్యామిలీ ఏంటి..
అని చూసుకుంటే మన దేశం ఇలా సంకనాకి పోదేమో పాపం....
నన్ను కామెంట్స్ ఎవరెవరు అయితే చేస్తారో.. చేయండి పర్వాలేదు.
ఎవడికి నేను ఆన్సర్ చెప్పను నాకు అవసరం లేదు...
నా నిజాయితీ ఇది అని ప్రూవ్ చేసుకునే కర్మ నాకు పట్టలేదు. అలా పడితే ఇంక నా లైఫ్ ఎండ్.
కావునా ఇలాంటి గాసిప్స్‌ని నేనసలు లెక్కచేయను. చెడ్డ పేరు గురించి పట్టించుకోను.
ఎందుకంటే నాకు తెలుసు నేను ఏంటో.
కేవలం నా జీవీతం గురించి జాగ్రత్త తీసుకుంటాను.
నేను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నాను.. కానీ మీకు ఎలాంటి ప్రమాణాలు చేయలేదు.
కాబట్టి నన్ను ప్రశ్నించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. నా బాధ్యతగా ఏం చేయాలో అది చేస్తున్నా..
నేను ఈ దేశంలోనే బెస్ట్ సిటిజన్ కాగలననే నమ్మకం ఉంది.
నేను ప్రమాణం చేసిన రోజున అడగండి.
ఇప్పటికి మీ ఎమ్మెల్యేని అడుక్కోండి.. ఏం పీకావురా మా ఏరియాకి అని, అప్పుడు బాగుపడుతుంది దేశం".