సినిమాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటీమణులంతా సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్‌లు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి, మాధవీ లత లాంటి వారు ఇదే బాటలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మాధవీ లత మరో వివాదంతో తెర మీదకు వచ్చింది. ఇటీవల యూట్యుబ్‌ ఇంటర్వ్యూలతో సంచలన సృష్టిస్తున్న వివాదాస్పద కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ కు ఆమె లీగల్‌ నోటీసులు పంపారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మాధవీ లత గత ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో చేరింది. తరువాత యామిని సాధినేని, శ్రీరెడ్డిలతో వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది.

తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యులలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది మాధవీ లత. ఇటీవల రాకేష్ మాస్టర్ ఓ వీడియోలో సినీ నటుల కరోనా సమయంలో ప్రజలకు సాయం చేయాలంటూ కామెంట్ చేశాడు. అదే వీడియోలో మాధవీ లత పైన కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో మాధవీ లత రాకేష్ మాస్టర్‌ఫై ఫైర్‌ అయ్యింది. ఆ తరువాత కూడా రాకేష్ మాస్టర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయటంతో ఆమె చట్టపరమైన చర్యలకు పూనుకుంది.