చికాగో సెక్స్ రాకెట్ లో మాధవిలత పేరు : కోపంతో భూతులు తిట్టేసింది

First Published 24, Jun 2018, 12:19 PM IST
Madhavi latha fires on a netiezen regarding chicago sex rocket
Highlights

చికాగో సెక్స్ రాకెట్ లో మాధవిలత పేరు : కోపంతో భూతులు తిట్టేసింది

అమెరికాలోని సెక్స్‌రాకెట్‌లో హీరోయిన్ మాధ‌వీల‌త పేరు కూడా ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తుండ‌టంతో మాధ‌వీ ల‌త ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా మాధ‌వీ ల‌త బూతులు తిట్టేస్తోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి విన్నాను. అయితే, అందులో నేను కూడా ఉన్న‌ట్టు కొంత మంది ప్ర‌చారం చేస్తున్నారు. అలాంటి వాళ్ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మాధ‌వీల‌త ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది. ఆ సంఘ‌ట‌న‌లో నువ్వు వ‌చ్చావా..? నువ్వు ఉన్నావా..? అంటూ త‌న‌పై ఎవ‌రైతే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారో వారిని చెడా మ‌డా తిట్టేస్తోంది మాధ‌వీల‌త‌. మీకు స‌మాధానం చెప్పి నా నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రంలేదు. మీకు నిజంగా ద‌మ్ముంటే మీ ఏరియా ఎమ్మెల్యేను అడ‌గండి మా ఏరియాకు ఏం చేశావురా..? అని అంతేకానీ, నాతో పెట్టుకోవ‌ద్దు అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది

loader