Asianet News TeluguAsianet News Telugu

హేమ ఆరోపణలపై `మా` అధ్యక్షుడు నరేష్‌ కౌంటర్‌.. జీవిత ఫైర్‌..

 `మా` నిధులు దుర్వినియోగం అయినట్టు నటి హేమ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా `మా` అధ్యక్షుడు నరేష్‌, జీవిత స్పందించారు. 

maa president  naresh and jeevitha rajashekar counter to hema allegations
Author
Hyderabad, First Published Aug 9, 2021, 11:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

`మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌`(మా) ఎన్నికల వేడి మరింతగా పెరుగుతుంది. ఉన్నట్టుండి ఇటీవల `మా` అధ్యక్ష బరిలో ఉన్న నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. `మా` నిధులు దుర్వినియోగం అయినట్టు ఆమె ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా `మా` అధ్యక్షుడు నరేష్‌ స్పందించారు. సోమవారం ఓ వీడియో ద్వారా `మా` రెండేళ్లలో ఏం జరిగిందనేది వివరించారు. అదే సమయంలో అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆమె వ్యాఖ్యలు తమని షాక్‌కి గురి చేశాయన్నారు. 

`మా`కి సంబంధించి ఒక్క రూపాయి కూడా గోల్‌మాల్‌ జరగలేదని, ఇప్పటికీ సరిపడ మనీ `మా`లో ఉందన్నారు. కోవిడ్‌ టైమ్‌లో జీవితగారు పది లక్షల డొనేట్‌ చేశారని తెలిపారు. ఈ విషయంలో హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కరోనా దృష్ట్యా `మా` ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని వివరించారు. 

జీవిత మాట్లాడుతూ హైమపై ఫైర్‌ అయ్యారు. కరోనా సమయంలో ఎవరిని ఫండ్‌ అడుగుతామని నిలదీశారు. ఈసీ మీటింగ్‌లో ఓ వార్‌ జరుగుతుందని, అందరు గొడవలు పడుతుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకోనివ్వరని, ఎలాంటి పనులు చేయనివ్వడం లేదన్నారు. కొత్త కమిటీ ఏర్పడ్డప్పుడు పెద్ద హీరోలంతా తమ రెమ్యూనరేషన్‌లో కొంత శాతం `మా`కి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు వారిని కూడా అడగలేని పరిస్థితి ఉందని వెల్లడించారు. ఆగస్ట్ 22న ఏజీఎం నడుపుతామని, ఆ రోజు సభ్యులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎలక్షన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదిలాఉంటే `మా` ఎన్నికల బరిలో ఇప్పటికే ఐదుగురు నిల్చున్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్‌, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో `మా` ఎలక్షన్ల రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో `మా`పై ఆరోపణలు, లోకల్‌, నాన్‌లోకల్‌ వాదన తెరపైకి రావడం, `మా` కోసం సపరేట్‌గా ఓ బిల్డింగ్‌ నిర్మించాలనుకోవడం, అందుకు మంచు విష్ణు తన సొంత డబ్బులతో బిల్డింగ్‌ నిర్మిస్తానని చెప్పడం, బాలకృష్ణ `మా` నిధులపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇటీవల హేమ సైతం ఆరోపణలు చేయడంతో `మా` మరింత హీటెక్కిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios