Asianet News TeluguAsianet News Telugu

నరేష్, ప్రకాష్ రాజ్ వర్గాల నైట్ పార్టీలకు మీరు వెళ్ళారా? బండ్ల గణేష్ ఫైరింగ్ రియాక్షన్!

తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుత పరిస్థితులపై గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ వర్గం నిర్వహించిన నైట్ పార్టీకి మీరు వెళ్ళారా? అని అడుగగా.. గణేష్ ఫైర్ అయ్యారు.

maa elections heat actor bandla ganesh latest comments getting viral
Author
Hyderabad, First Published Sep 10, 2021, 9:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ లో ఎలక్షన్స్ హీట్ కొనసాగుతుండగా, మా సభ్యుల వివాదాలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బండ్ల గణేష్. మొదట్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడిగా, మీడియా ముఖంగా ఆయనకు మద్దతుగా తెలిపిన బండ్ల గణేష్, ప్లేట్ ఫిరాయించిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ నాకు ఇష్టం అంటూనే... జీవిత రాజశేఖర్ ఎంట్రీ కారణంగా బయటికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి సెక్రటరీ పదవికి పోటీ చేయనున్న జీవితా రాజశేఖర్ గతంలో చిరు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ కారణంగా ఆమెను విబేధించడమే కాకుండా, ఆమెకు పోటీగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. 


ఈ వ్యవహారం జీవిత రాజశేఖర్, బండ్ల గణేష్ మధ్య వాదోపవాదనలకు దారితీసింది. కాగా తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుత పరిస్థితులపై గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ వర్గం నిర్వహించిన నైట్ పార్టీకి మీరు వెళ్ళారా? అని అడుగగా.. నేను వెళ్లలేదు, అలాంటి పార్టీ జరగలేదని బండ్ల అన్నారు. పరిశ్రమ పెద్దగా ఉన్న ప్రముఖ హీరో బర్త్ డే పార్టీని ఇలా వాడుకున్నారని, ప్రకాష్ రాజ్ వర్గం ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం ఉంది అని, యాంకర్ బండ్ల గణేష్ ని అడిగారు. అది నిజం కాదని, ఆ రోజు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లో లేరు, చెన్నైలో ఉన్నారని బండ్ల గణేష్ ఖండించారు. 

నాకు తెలిసి ఎలాంటి పార్టీ జరగలేదు. ఒక వేళ జరిగినా నేను వెళ్ళలేదని బండ్ల అన్నారు. అలాగే అసలు ఈ పార్టీలు జరిగాయని మీకు ఎలా తెలుసని, యాంకర్ ని ఎదురు ప్రశ్నించారు. నరేష్ వర్గం కూడా పార్టీ ఏర్పాటు చేశారట, దానికి వెళ్ళారా? అని యాంకర్ అడుగగా.. నేను ఎవ్వరి పార్టీకి వెళ్లలేదని అన్నారు. 


టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కొనసాగుతుంది, ఒక వేళ ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా గెలిస్తే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఏదైనా చర్యలు తీసుకుంటారా?  అని యాంకర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చిరాకు పడ్డ బండ్ల గణేష్, ఆలు లేదు చూలు లేదు... వాళ్ళను కేవలం సమాచారం కోసం విచారిస్తున్నారు. ఇంకా ఆ కేసులు ఏమిటో ఎవరికీ తెలియదు. వాళ్లపై చర్యల గురించి ఏం మాట్లాడతామని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios