యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘అశ్వథ్థామ’కు మాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న పరుశరాం శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. తను డైరెక్ట్ చేసిన ‘రణస్థలి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేశారు.

సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం ‘రణస్థలి’ (Ranasthali). ఈ చిత్రంతో యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘అశ్వథ్థామ’కు మాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న పరుశరాం శ్రీనివాస్ (Parusharam Srinivas) దర్శకుడిగా మారాడు. తను డైరెక్ట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ (Director Krish) రిలీజ్ చేయడం విశేషం.

సురెడ్డి విష్ణు నిర్మించిన చిత్రం "రణస్థలి". ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయ్యారు. ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్‌ లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా "రణస్థలి" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ సినిమా గురించి మాట్లాడుతూ.. "రణస్థలి" సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్ కు తగ్గట్టుగా సినిమా టీజర్ అద్భుతంగా ఉందన్నారు. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్ లెవెల్ లో ఇంపాక్ట్ ఇస్తున్నాయని తెలిపారు. సినిమా సక్సెస్ కావాలని టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరని దర్శకుడు పరుశరాం శ్రీనివాస్ తెలిపారు. ‘రణస్థలి’ రిలీజ్ తర్వాత చిన్న సినిమాపై చులకన బావం పోతుందని అన్నారు. డిఫరెంట్ జానరల్ లో ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించినట్టు తెలిపారు. 

నటీనటులుగా ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధర్మ,బసవ మరియు సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురెడ్డి విష్ణు నిర్మించారు. పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. కెమెరామెన్ : జాష్టి బాలాజీ, ఎడిటర్ : భువన్, కెమెరా అసిస్టెంట్ సాయి, డైరెక్టర్ అసిస్టెంట్ గా మూర్తి పనిచేశారు.