Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ వర్కర్ గా మారిన ఆశా శైని(ఫ్లోరా, మయూరి)

  • సెక్స్ వర్కర్ గా మారిన ఆశా షైని
  • విద్యాబాలన్ బేగంజాన్ సినిమాలో ఆశా శైని
  • సినిమమా కోసం సెక్స్ వర్క్ పాత్రలో చేయనున్న ఆశాశైని
lux papa song asha flora saini mayuri in sexy role

బాలయ్య పక్కన లక్స్ పాప లక్స్ పాప అంటూ చిందులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హీరోయిన్ ఆశా శైని. అప్పట్లో కాస్త హాట్ ఇమేజ్ సంపాదించిన ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అడపాదడపా సినిమాలను చేస్తూ కాలం వెళ్లదీస్తున్న అమ్మడు ఇప్పుడు సెక్స్ వర్కర్ గా కూడా మారిందట.  అయితే అది కేవలం సినిమా కోసమే అని అంటున్నారు. ఏంటి ఇంకా అర్ధం కాలేదా అదేనండి సినిమాలో శైని సెక్స్ వర్కర్ రోల్ చేస్తుందట.

 

విద్యా బాలన్ నటిస్తున్న బేగం జాన్ సినిమాలో ఆశా శైని కూడా కీలక రోల్ ప్లే చేస్తుంది. శ్రీజిత్ ముఖర్జి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆశా శైని కూడా అద్భుతమైన రోల్ ప్లే చేస్తుందట. ధనక్ సినిమాలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయిన శ్రీజిత్ బేగం జాన్ లో అవకాశం ఇచ్చాడు.

 

తెలుగు హీరోయిన్ గా అందరికి సుపరిచితురాలైన ఆశా శైని అప్పట్లోనే హాట్ ఇమేజ్ తో అందరిని అలరించింది. లక్స్ పాప లక్స్ పాప సాంగ్ లో బాలయ్యతో ఆశా చేసిన హాట్ షో ఫ్యాన్స్ ను అలరించింది. అయితే ఆ తర్వాత అమ్మడు హీరోయిన్ గా క్లిక్ అవ్వలేదు. అందిన్వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వస్తున్న ఆశా ప్రస్తుతం తన ఆశలన్ని బేగం జాన్ మీదే పెట్టుకుంది.

 

సినిమాలో విద్యాబాలన్ తో పాటుగా తన క్యారక్టర్ కూడా హైలెట్ అవుతుందని భావిస్తుంది ఆశా శైని. అంతేకాదు ఈ సినిమా మరికొన్ని సినిమా అవకాశాలను తెచ్చి పెడుతుందని నమ్ముతుంది. బేగం జాన్ ఆశా ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios