బిగ్‌బాస్‌4 షోలో ఎనిమిదో రోజు మొదట కాస్త డల్‌గా సాగినా క్రమంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ప్రధానంగా ముగ్గురు కంటెస్టెంట్స్ మధ్య లవ్‌ స్టోరీ సాగుతుందని అర్థమవుతుంది. 

ఆ ముగ్గురు ఎవరో కాదు మోనాల్‌ గజ్జర్‌, అఖిల్‌, అభిజిత్‌. ఏడో రోజు రాత్రి అభిజిత్‌, మోనాల్‌ రహస్యంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత మధ్యలోనే మోనాల్‌ వెళ్ళిపోయింది. మార్నింగ్‌ మోనాల్‌, అఖిల్‌ మధ్య దీనికి సంబంధించిన డిష్కషన్‌ జరిగింది. ఇందులో మోనాల్‌ మరోసారి ఎమోషనల్‌ అయ్యారు. తమ మధ్య ఏం లేదంటూ, కోపం వస్తుందంటూ ఏడూస్తూ వెల్ళిపోయింది. 

ఈ విషయంపై లాస్యతో అఖిల్‌ డిష్కస్‌ చేశారు. ఆ తర్వాత మోనాల్‌.. అఖిల్‌ వద్దకు వెళ్ళి తనకు మాట్లాడటం ఇష్టమని, అంతకు మించి ఏం లేదని తెలిపింది. కాసేపు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నారు. దీంతో వీరికి సంబంధించిన ఎపిసోడ్‌.. మొత్తంగా ముగ్గురు మధ్య ఏదో జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.