కరోనా కారణంగా జన జీవనం అస్తవ్యస్తం గా మారింది. లాక్ డౌన్ కారణం లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావం సినీ రంగం లో పని చేసే వాళ్ళమీద కూడా చాలా ఎక్కువగా ఉంది. సినీరంగం లో పెద్ద స్థాయిలో ఉన్న వారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. రోజు వారి కూలీ కి పని చేసే వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ లాంటి భారీ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న రవి బద్రు, టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తమ కుల వృత్తులు చేస్తూ కనిపించారు.

ఓ బాలీవుడ్‌ సీరియల్‌ నటి కూడా ఈ సందర్భంగా తన కష్టాలను అభిమానులతో పంచుకుంది. షూటింగ్ లు లేకపోవటంతో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ఆ నటి తన మేకప్ మేన్‌ దగ్గరే అప్పు చేశానని తన ఆవేదనను పంచుకుంది.  తాజా గా మరో నటుడు కూడా ఇలాగే కనిపించాడు. హిందీ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన సోలంకి దివాకర్ అనే నటుడు ముంబై రోడ్ల మీద పండ్లు అమ్ముతూ కనిపించాడు. బాలీవుడ్‌లో తిత్లీ, డ్రీమ్ గర్ల్‌, సోంచారియా, హల్కా వంటి సినిమాల్లో నటించిన సోలంకి దివాకర్(35)‌ను కరోనా కష్టాలు చుట్టుముట్టాయి.
Actor sales fruits, లాక్‌డౌన్ ఆర్థిక కష్టాలు.. పండ్లు అమ్ముతున్న నటుడు..!

దీంతో ఆయన పండ్ల వ్యాపారిగా మారిపోయాడు. సినీ నటుడిగా మారక ముందు ఆయన ఇదే పని చేసేవాడు. తాజాగా షూటింగ్ లు నిలిచిపోవటంతో కుటుంబ పోషణ కోసం తిరిగి అదే పనిని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సోలంకి మాట్లాడుతూ.. `లాక్‌డౌన్‌ విడతల వారిగా కొనసాగుతూ ఉండటంతో నాకు ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. నేను ఇంటికి రెంట్ కట్టాలి. అలాగే ఇంట్లో అందరినీ చూసుకోవాలి. అందుకే నేను గతంలో చేసిన పని పండ్ల వ్యాపారం చేస్తున్నా` అంటూ తన కష్టాలను వివరించాడు.