టాలీవుడ్ లిప్ లాక్ సీన్స్.. హద్దులు చెరిపేస్తున్న ముద్దులు

lip lock scenes in tollywood
Highlights

ఒకప్పుడు హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన లిప్ లాక్ సీన్స్, శృంగార భరిత సన్నివేశాలు మెల్లగా బాలీవుడ్ కు పాకాయి. తెలుగులో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కానీ లిప్ లాక్ సన్నివేశాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 

ఒకప్పుడు హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన లిప్ లాక్ సీన్స్, శృంగార భరిత సన్నివేశాలు మెల్లగా బాలీవుడ్ కు పాకాయి. తెలుగులో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కానీ లిప్ లాక్ సన్నివేశాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అవి కూడా మన హీరోయిన్లు ఏ బెలూన్ కో మరో వస్తువుకో ముద్దు పెడితే దాన్ని హీరోకి పెట్టినట్లు తమ గ్రాఫిక్ వర్క్ తో మ్యాజిక్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లు బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి అభ్యంతాలు పెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ సన్నివేశాల్లో నటించడం ద్వారా వారి క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

దీంతో దర్శకనిర్మాతలు కూడా అవసరం ఉన్నా లేకపోయినా కచ్చితంగా లిప్ లాక్ సీన్స్ మాత్రం సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఈ లిప్ లాక్ సీన్స్ ను పోస్టర్లలో వేసి హైప్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది 'అర్జున్ రెడ్డి' సినిమా గురించే.. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో లేకలేనన్ని లిప్ లాక్స్ ఉన్నాయి. కంటెంట్, స్టోరీ పక్కన పెడితే కేవలం ఇటువంటి సన్నివేశాలు మాత్రమే చూడాలని థియేటర్ కు వెళ్లేవారు కోకొల్లలు. దర్శకులు కూడా యూత్ ను ఆకర్షించడానికే తమ సినిమాలలో ఈ తరహా సన్నివేశాలు పెడుతున్నారనేది కొందరి వాదన.

నిజానికి అర్జున్ రెడ్డి సినిమా మొదటి షో చూసిన వారిలో నెగెటివ్ కామెంట్స్ చేసిన వారే ఎక్కువ. కానీ మెల్లమెల్లగా ఈ సినిమా పుంజుకోవడానికి కారణం సినిమాలో రొమాన్స్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. సన్నివేశాలు రియలిస్టిక్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకాదరణ లభించింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన 'Rx 100' సినిమాకు మొదట నెగెటివ్ టాక్ వచ్చినా.. సినిమాలో రొమాన్స్ గాఢత ఎక్కువగా ఉండడంతో యూత్ ఈ సినిమాపై మక్కువ చూపుతున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా బోల్డ్, రొమాంటిక్ సీన్స్ లో నటించడం యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. 

మరికొందరు మాత్రం సెన్సార్ సభ్యులు ఈ సినిమాను ఎలా ఒకే చేశారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు లిప్ లాక్స్ కూడా సినిమాను నిలబెడుతున్నాయనేదానికి ఉదాహరణగా నిలిచిందీ చిత్రం. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలలో కూడా లిప్ లాక్ అనేది కామన్ అయిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన 'రంగస్థలం','నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' వంటి సినిమాలలో కూడా లిప్ లాక్స్ కనిపిస్తాయి. మొత్తానికి టాలీవుడ్ సినిమాలు కూడా బాలీవుడ్, హాలీవుడ్ రొమాంటిక్ సీన్స్ కు ఏమాత్రం తీసిపోవని నిరూపిస్తున్నాయి. 
 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader