కరోన మహమ్మారి సినీ రంగానికి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే కరోనా కారణం సినిమా బిజినెస్‌ పూర్తిగా స్తంబించిపోయింది. దీనికి తోడు కరోనతో మరణిస్తున్న సినిమా ప్రముఖుల వివరాలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ కరోనా సోకుతుండటంతో ఇండస్ట్రీలో వరంగాలో భయాందోళనలు నెలకొన్నాయి.

తాజాగా విభిన్న చిత్రాల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని తెలియటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆయనకు ఈ నెల 9న కరోన పాజిటివ్‌ వచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో మేసేజ్‌ రిలీజ్  చేశారు. కొద్ది పాటి లక్షణాలు ఉన్న సమయంలోనే తాను టెస్ట్ చేయించుకున్నాని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా సింగీతం వెల్లడించారు.

అయితే వీడియోలో ఆయన ఎంతో ఉల్లాసంగా ఆరోగ్యంగా కనిపించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈసందర్భంగా తనను కాంటాక్ట్ చేయాడానికి ప్రయత్నిస్తున్న చాలా మందితో మాట్లాడలేకపోతున్నానని, కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్నందున్న అందరితో టచ్‌లోకి రాలేకపోయానని చెప్పారు. ఈ నెల 23తో క్వారెంటైన్‌ ముగుస్తుందని తరువాత తన రెగ్యులర్‌ యాక్టివిటీ ప్రారంభిస్తానని చెప్పారు సింగీతం.