మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని బాగుంటే  ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. దాంతో ఈసినిమాను డిజిటల్ రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట చిత్ర నిర్మాతలు . ఆహా లేదా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు డిస్కషన్స్ జరుగుతున్నాయంటున్నారు. అయితే ఆహా లేదా అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఇవ్వటానికి కుదిరే అవకాసం లేదంటున్నారు. అలా చేస్తే లీగల్ గా సమస్యలు వచ్చే అవకాసం ఉందంటున్నారు. 


ఎందుకంటే ఈ సినిమా కరోనా రాకముందే...నెట్ ఫ్లిక్స్ వారితో ఎగ్రిమెంట్ చేసుకున్నారట. దాంతో నెట్ ఫ్లిక్స్ వారు ..ఈ సినిమాని తమకు ఇవ్వకుండా వేరే ఓటీటికు ఇస్తానంటే ఒప్పుకోరని వినపడుతోంది. ఈ మేరకు నెగోషియోషన్స్ జరుగుతున్నాయంటున్నారు. వేరే సినిమాని అందుకు బదులుగా ఇచ్చేలాగా నిర్మాణ సంస్ద ప్రపోజల్ పెట్టిందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు. 
 
ఇక ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. అందుకునే ఈ చిత్రం నాన్ థియోటర్ రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నా అమ్మలేదని తెలుస్తోంది. అలాగే తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని అన్ని ఏరియాలు సొంతగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. లాక్ డౌన్ అయ్యాక..పరిస్దితిలను బట్టి థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూసి దాన్ని బట్టి రిలీజ్ ప్లాన్ చేసుకుందాం..కంగారు పడద్దు అనే ఆలోచన కూడా ఉందిట. 
 
ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రం టీమ్ ప్రకటించింది. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆ రిలీజ్ డేట్ కు విడుదల చేయటం జరిగే పని కాదు.