చాలా కాలం క్రితమే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన లావణ్ త్రిపాఠి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్‌ మాత్రమే  చేయటంతో ఈ భామకు కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. దీంతో అనుకున్న స్థాయిలో ఇమేజ్‌ సాధించకలేకపోయింది. అయితే ఇటీవల కాస్త హద్దు దాటి నటిస్తున్నా ఇప్పటికే నష్టం జరిగిపోయింది. ఉన్నది ఒకటే జిందగీ, ఇంటిలిజెంట్ సినిమాలో కాస్త గ్లామరస్‌గా కనిపించిన ఆ సినిమాలు కూడా సక్సెస్‌ కాకపోవటంతో కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు.

దీంతో అసలు విషయం తెలుసుకున్న ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంతేకాదు లాక్‌ డౌన్‌ సమయంలో ఓ డిజిటల్ మీడియాకు ఇచ్చిన్న ఇంటర్య్వూలో తాను గ్లామర్‌ షోకు కూడా రెడీ అంటూ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో లావణ్యకు అవకాశాలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ సడన్‌ ఈ ముద్దుగుమ్మ మళ్లీ మాట మార్చింది. గ్లామర్‌ షో సంగతి పక్కన పెడితే రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా నటించబోనని చెప్పింది లావణ్య.

ప్రస్తుతం కరోనా కారణంగా ఒక మనిషిని మరో మనిషి తాకే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సినిమాల్లో ఇంటిమేట్‌ సీన్స్‌ చిత్రీకరించటం ఎలా చర్చ చాలా రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాను ఇక మీదట రొమాంటిక్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించబోనని క్లారిటీ ఇచ్చింది లావణ్య. అదే సమయంలో త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో తాను రొమాంటిక్ సీన్స్‌లో నటించానని అయితే అవి కరోనా రాక ముందే చిత్రీకరించినవని క్లారిటీ ఇచ్చేసింది.