తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి త్రిషకి ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస ఆఫర్లు రావడంతో బిజీ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలతో జత కడుతూ సక్సెస్ లు అందుకుంటోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో ఒకటైన 'పరంపదం విలయట్టూ' అనే సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో త్రిష అర్ధనగ్నంగా కనిపించబోతుందట.

కథలో భాగంగా సినిమాలో త్రిష దెయ్యం పాత్రలో నటిస్తోంది. ఆ పాత్రలో త్రిష అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. అందులో భాగంగానే టాప్లెస్ గా ఆమె  నటించిందని సినిమా వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే మరికొందరు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని, అదంతా మేకప్ లో భాగంగానే చేశారని, స్కిన్ కలర్ మేకప్ వేశారని చెబుతున్నారు. అయితే దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది!