Pushpa2 కీ షెడ్యూల్ పూర్తి.. ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్న షెకావత్ సార్.. క్రేజీ అప్డేట్
‘పుష్ప2’ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. తాజాగా పుష్ప కీ షెడ్యూల్ పూర్తైన సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ’(Allu Arjun) - క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Pushpa2 The Rule. 2021లో వచ్చిన ‘పుష్ప’కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. గతేడాదే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన Where is Pushpa అనే స్పెషల్ వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమాపై తారాస్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఎప్పటికప్పడు అందిస్తూనే ఉన్నారు. చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేలా సమాచారం అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ఈచిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్వర్ సింగ్ షెకావత్ గా పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్నారు.
‘పుష్ప2 ది రూల్’లో బనర్వ్ సింగ్ షెకావత్ కు సంబంధించిన కీ షెడ్యూల్ ను తాజాగా పూర్తి చేసినట్టు మేకర్స్ తెలిపారు. ఈసారి షెకావత్ ప్రతీకారం తీర్చుకునేందుకు తిరిగి వస్తున్నారంటూ ఆసక్తిని పెంచారు. ఈక్రమంలో సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోను కూడా విడుదల చేశారు. ఈ అప్డేట్ తో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. .
ఫహద్ ఫాజిల్, బన్నీ మధ్య వార్ ఎలా ఉండబోతోంది. పుష్పరాజ్ చేసే మాఫియా కార్యక్రమాలను ఎలా అడ్టుకుంటారనేది చూడాలి. చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్. సునీల్, అనసూయ, జగపతి బాబు తదితర తారగణం కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.