బిగ్ బాస్ అంటేనే గొడవలు, వివాదాలు. వివిధ నేపధ్యాలు, రంగాలకు చెందిన కొందరు ఒక ఇంటిలో జీవించడం అనేది ఈ షో కాన్సెప్ట్. 15 మంది పాల్గొనే ఈ రియాలిటీ షోలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఓ విషయంపై ఏకాభిప్రాయం కుదరనప్పుడు గొడవలు కామన్ గా జరుగుతుంటాయి. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, గిల్లికజ్జాలు ప్రేక్షకులకు భలే సరదా పంచుతాయి. 

ఇక బిగ్ బాస్ సీజన్ 4 మొదలై రెండవరోజు కావస్తుండగా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ తమకు నచ్చని ఓ కంటెస్టెంట్ ని నామినేట్ చేయడంతో పాటు, వారి ముఖంపై డోరు వేయాలని చెప్పడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య వివాదం రగిలినట్లు తెలుస్తుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో జోర్దార్ సుజాత, నటి కరాటే కళ్యాణి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. 

ఎదో విషయమై జోర్దార్ సుజాత కరాటే కళ్యాణిని తప్పుబట్టడం జరిగింది. దానికి కరాటే కళ్యాణి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్ అని సుజాతపై కోప్పడ్డారు. సుజాత నేను చెప్పాలన్నది చెప్పుకోనివ్వరా అని ఆవేదన చెందగా, కరాటే కళ్యాణ్ నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను, నాకు దేవుడు పెద్ద నోరు ఇచ్చాడని ఏడ్చేశారు. ఈ ప్రోమోలో జరిగిన గొడవకు కారణం ఏమిటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.