బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారం పూర్తి చేసుకుంది. గత ఆదివారం గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 4ని ప్రారంభించిన నాగార్జున నేడు శనివారం కావడంతో రంగంలోకి దిగనున్నారు. వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తన, తీరును ఆయన రివ్యూ చేయనున్నారు. ఇక నేడు సాయంత్రం ప్రసారం కానున్న బిగ్ బాస్ ప్రోమో స్టార్ మా విడుదల చేసింది. ప్రోమోలో నోయల్ ఓవర్ థింకింగ్ అని ఎందరు భావిస్తున్నారని నాగార్జున అడిగారు. దాదాపు ఓ అరడజను కంటెస్టెంట్స్ చేయి ఎత్తి నోయల్ ఓవర్ థింకింగ్ అని కన్ఫర్మ్ చేశారు. 

కాగా దర్శకుడు సూర్య కిరణ్ కి నాగ్ చిన్నపాటి క్లాస్ పీకారు. నీకు సంబంధం లేని విషయాలలో తల ఎందుకు దూరుస్తున్నావ్ అన్నారు. నువ్వు డైరెక్టర్ కావడం వలన మిగతా కంటెస్టెంట్స్ అందరూ క్యారెక్టర్స్ అనుకుంటున్నావా అన్నారు. ఇక హౌస్ లో డస్ట్ బిన్ ఎవరని భావిస్తున్నారో వారి మెడలో డస్ట్ బిన్ సింబల్ ఉన్న ట్యాగ్ వేయాలని కోరారు. ఈ టాస్క్ లో ఆరియానా హీరో అభిజిత్ మెడలో ఆ ట్యాగ్ వేసింది. 

మరికొన్ని గంటల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. హోస్ట్ గా నాగార్జున ఫన్ తో పాటు ఇంటి సభ్యులకు షాక్స్ ఇవ్వనున్నారని అర్థం అవుతుంది. ఇక నేడు మరియు రేపటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఆ పర్సన్ ఎవరో తేలనుంది. మొదటివారానికి మొత్తం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ వీడనున్నారు.