టీవీ హోస్ట్ మరియు కమెడియన్ భారతి సింగ్‌ అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను అరెస్ట్‌చేయడం జరిగింది. నేడు మార్నినింగ్ భారతీ సింగ్‌ ఇంటిపై ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఆమె ఇంట్లో  గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు.దీనితో   భారతి సింగ్, ఆమె హస్బెండ్ హర్ష్ లింబాచియాను అరెస్ట్ చేసిన విచారం చేపట్టారు. . అనంతరం భారతీ సింగ్‌తో పాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను అరెస్ట్‌ చేసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించారు.  

భారతీ సింగ్‌ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు.కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్‌ చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ విచారణ ఎదుర్కొన్నారు. . అలాగే నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. రాంపాల్‌, అతని గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్‌ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని  చెప్పాడు.