ఇటీవల హీరోయిన్‌ మీరా చోప్రా, ఎన్టీఆర్‌ అభిమానుల తీవ్రస్థాయిలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. మీరాచోప్రాను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ఆమె స్క్రీన్‌ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఇతర హీరోల అభిమానులతో ఎన్టీఆర్‌ అభిమానులను పోలుస్తూ ట్వీట్లు చేయటంతో వారు మరింతగా రెచ్చిపోయారు. తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో విమర్శలకు దిగారు.

దీంతో మీరా చోప్రా చట్టపరమైన చర్యలకు దిగింది. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కంప్లయింట్‌ కూడా ఇచ్చింది. అంతేకాదు ఆ స్క్రీన్‌ షాట్స్‌ను తన ట్విట్ పేజ్‌లో షేర్‌ చేస్తూ నన్ను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని కేటీఆర్‌, కవితలకు టాగ్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. మీరా చోప్రా చేసిన ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. `మేడమ్‌.. నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సిటీ పోలీసులను చట్టపరంగా చర్చలు తీసుకోవాల్సిందిగా సూచించానని` ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ స్పందించటంపై మీర చోప్రా హర్షం వ్యక్తం చేసింది. `మీరు స్పందించటం చాలా ఆనందంగా ఉంది. మహిళల రక్షణకు ఇలాంటి చర్యలు అవసరం. ఇలాంటి వ్యక్తలను మహిళలను ఇబ్బందుల పాలు చేసేట్టుగా స్వేచ్ఛగా వదిలిపెట్టకూడదు` అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఈ వివాదం ఎన్టీఆర్‌ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.