మొదటిసారి అర్జున్ రెడ్డి సినిమాకి ఫిలింఫేర్ అందుకున్న విజయ్ దేవరకొండ. అందునా చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి వారితో పోటీపడి ఓ యువహీరో అవార్డు అందుకుంటే దానిని ఎవరైన తీపి జ్ఞాపకంగా ఇంటిలో పదిలంగా పెట్టుకోవాలని భావిస్తారు. కానీ విజయ్ దేవరకొండ ఎప్పుడు అందరికంటే డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. 

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ తాజాగా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఈ సందర్బంగా విజయ్ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఫిలిం ఫేర్ అవార్డుపు వేలం వేసి ఆ డబ్బును సిఎం రిలీఫ్ పండ్ కు ఇస్తానని చెప్పాడు. ఎంతమంది వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నవారికి కేటిఆర్ సాయం చేయడం గమనిస్తున్నా. ఈ అవార్డు తన ఇంట్లో ఉండడం కంటే సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేను పుట్టిన రాష్ర్టానికి ఉపయోగపడటం తనకు ఎంతో ఆనందానిచ్చే విషయమని విజయదేవరకొండ తెలిపాడు.ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ విజయ్ ను ప్రశంసించారు. అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, సిఎం రిలీఫ్ ఫండ్ కు సాయం చేయాలనుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. విజయ్ నీ నిర్ణయాన్ని అభినందిస్తున్న. ఈ విషయం గురించి మనం త్వరలో కూర్చొని మాట్లాడుకుందాం అని ట్వీట్ చేశాడు.