టైటిల్ తోనే ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం నేటితరం సినిమావాళ్ళ అసలు టార్గెట్. అది క్లిక్ అయితే ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ పెరుగుతాయి. రీసెంట్ గా ఆర్ఎక్స్100 సినిమా అందుకున్న విజయం అందుకు ఉదాహరణ. ఆ సినిమా ఫస్ట్ లుక్ తోనే వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ks100 అంటూ మరికొంతమంది అదే ఫార్మాట్ లో కొత్తగా ట్రై చేస్తున్నారు. 

అయితే ఈ సినిమా  హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్,  రొమాంటిక్ జొనర్స్ లో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆడియెన్స్ ను ఇన్స్పైర్ చెసెలా తీశాము అంటూ యూత్ ను, లేడీస్ ను ఆకట్టుకునె అంశాలుంటాయని అంటున్నారు. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ వెంకట్ రెడ్డి "కెఎస్100" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇక దర్శకుడు షేర్ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరిస్తూ మీడియాతో మాట్లాడారు.  'గోవా , హైదరాబాద్ , మహారాష్ట్రలోని హిరంబుల్ లొని లొకెషన్స్ లొ షూటింగ్ చేశాము.ఇంటర్నేషనల్ మోడల్స్ ను లీడ్ రొల్స్ లొ పరిచయం చెస్తున్నాము. చాలా మంది మోడల్స్ ను ఈ సినిమా లొ పరిచయం చెయటం  తెలుగులొ ఇదే  తొలిసారి. చిత్రీకరణ పూర్తయింది.  నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.‌టైటిల్ లొగో  విడుదల చెస్తున్నాము. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని తెలియజేశారు.