బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగానే కాక పలు ప్రపంచ దేశాల్లో క్రేజీ స్టార్ గా మారి ఓ రేంజ్ కు ఎదిగిన తెలుగు హీరో ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లికి సంబంధించి బాహుబలి ముందు నుంచే రకరకాల వార్తలు వస్తూనే వున్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు దీనిపై ఎప్పటికప్పుడు త్వరలో త్వరలో అంటూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడాయన కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.

 

ప్రభాస్‌ పెళ్లి గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.అసలేమి అనుకోలేదు కూడా. నిన్న మొన్నటి వరకూ 'బాహుబలి పూర్తయిన వెంటనే పెళ్లి' అనేవాడు. ఇప్పుడు 'సాహో అవ్వాలి' అంటున్నాడు. ఎప్పుడు చేసుకుంటాడో తనకే తెలియాలి అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారంటే ఇక ఆ విషయంలో ఆయన కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. విషయాన్ని ప్రభాస్ కే వదిలేసి.. తను కోరినప్పుడే దానిపై ఆలోచించాలని కృష్ణంరాజు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

 

ప్రభాస్‌తో చేయబోతున్న సినిమా గురించి కూడా స్పందించారు కృష్ణంరాజు. 'నిజానికి మా గోపీకృష్ణ సంస్థలో ప్రభాస్‌ హీరోగా 'ఒక్క అడుగు' చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాం. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు'.అన్నారు.

 

కృష్ణతో నాకు చాలా అనుబంధం ఉంది. మా ఇద్దరిని రాజకీయాల్లో చూడాలనుకుంటున్నామని ఆరోజుల్లో చాలామంది అడిగేవారు. ఇద్దరు కలిసి పార్టీ పెట్టండి అని సలహా ఇచ్చినవారు కూడా ఉన్నారు. కానీ అప్పట్లో మా ఇద్దరికీ రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఆ భారం మోయడం ఇష్టం లేక దాని గురించి ఆలోచించలేదు. నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఓ ప్రత్యేక వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నా. అభిమానుల మధ్య ఐదు దశాబ్దాల పండుగను జరుపుకుంటాను. ఎప్పుడు?.. ఎక్కడ? లాంటి వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తానన్నారు.