రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత సరైన హిట్ సాధించని రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
రవితేజ, శృతిహాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రం 'క్రాక్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నాడు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. మిగతావాళ్లెవరూ థైర్యం చేయని సిట్యువేషన్ లో ఈ సినిమా రిలీజ్ ని ప్రకటించటం అంతటా ఆశ్చర్యంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ స్పీడు పెంచారు. అందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. డైలాగులుతో అదరకొట్టిన ఈ ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు.
‘శంకర్ పోతరాజు వీర శంకర్.. షూర్ షాట్.. నో డౌట్.. పుచ్చే పేలిపోద్ది’ అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగులు జనాల్లోకి బాగా వెళ్లేటట్లు ఉన్నాయి. అలాగే ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే.. ఈ ముగ్గురుతో ఆడుకుంది ఒకే పోలీసోడూ’ అంటూ ట్రైలర్ ప్రారంభంలో హీరో వెంకటేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.
ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత సరైన హిట్ సాధించని రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
అలాగే త్వరలో కిలాడీ టైటిట్ తో రవితేజ కనిపించనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని సైతం నూతన సంవత్సర కానుకగా విడుదల చేసారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఆయన సరసన డింపుల్ హయతీ, మీనా చౌదరి కనిపించనున్నారు.పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Let's Welcome 2021with Surprise ⚔️
— Ramesh Varma (@DirRameshVarma) January 1, 2021
The Action will be doubled !!👬#HAPPYNEWYEAR 🎉#Khiladi Coming this Summer 2021...@RaviTeja_offl @DimpleHayathi @Meenachau6 @DirRameshVarma@ThisIsDSP @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl pic.twitter.com/ioMcRCwGVO
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 11:43 AM IST