కేపీ చౌదరి డ్రగ్స్ కేసు.. తెరపైకి హీరో సుశాంత్ రెడ్డి పేరు.. ఆయన రియాక్షన్ ఇదే..!!
నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో కేపీ చౌదరిని రెండు రోజులు కస్టడీలో తీసుకుని విచారించిన పోలీసులు.. కస్టడీ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.
నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో కేపీ చౌదరిని రెండు రోజులు కస్టడీలో తీసుకుని విచారించిన పోలీసులు.. కస్టడీ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలిపారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ తదితరులు తన వద్ద నుంచి డ్రగ్స్ కొనుగులో చేసినట్టుగా కేపీ చౌదరి చెప్పినట్టుగా కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీలతో కేపీ చౌదరి ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అంతేకాకుండా కేపీ చౌదరి చెప్పినవారి వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ కేసులో తన పేరును ప్రస్తావించడంపై హీరో సుశాంత్ రెడ్డి స్పందించారు. ఓ న్యూస్ చానల్‌తో సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసునని చెప్పారు. కేపీని కొన్ని సార్లు కలిశానని.. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని..డ్రగ్స్ సరఫరాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పరంగా కేపీ చౌదరితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
తాను ఎలాంటి టెస్టులకు అయినా సిద్దమేనని సుశాంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి విచారణకైనా సిద్దమేనని తెలిపారు. గోవాలో కేపీ చౌదరి చాలా మందికి తెలుసునని అన్నారు. కేపీ చౌదరిని ఈ మధ్య కలవలేదని చెప్పారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో తన ఫోన్ నెంబర్ ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ నగరానికి ఏమైంది చిత్రంలో సుశాంత్ రెడ్డి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.