సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య'... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించిన న్యూస్ లు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఈ చిత్రం నిమిత్తం దర్శకుడు కొరటాల శివ ఎంత రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపధ్యంలో అందిన ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మీకు అందిస్తున్నాం. 

కొరటాల శివ కూడా రాజమోళి తరహాలోనే ఫ్లాఫ్ అనేది లేకుండా వరస హిట్స్ తో కెరీర్ ప్రారంభం నుంచీ దూసుకుపోతున్నారు. ఆయనతో పనిచేయానికి హీరోలంతా ఉత్సాహం చూపిస్తూంటారు. ఇటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవటంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరోలు...కొరటాల శివతో సినిమా అంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి...నిర్మాతలు ఎంత ఇచ్చి అయినా కొరటాలని లాక్ చేయటానికి ప్రయత్నం చేస్తూంటారు. ఎందుకంటే కొరటాల సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ సినిమాని సొంతం చేసుకుంటూంటారు. ఈ డిమాండే కొరటాల రెమ్యునేషన్ ని డిసైడ్ చేస్తుంది.
  
ఇంతకాలం  కొరటాల శివ ప్రతి సినిమా కు మినిమం  15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ వస్తున్నారు. అయితే చిరంజీవి ఆచార్య చిత్రానికి కొరటాల భారీ మొత్తాన్ని ఆఫర్  చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క చిత్రానికి కొరటాల శివ దాదాపు 25 కోట్ల రూపాయల్ని తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు కొరటాల మిగతావన్ని ప్రక్కన పెట్టి... కేవలం చిరు చిత్రం కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కొరటాల శివ కి ....భరత్ అనే నేను చిత్రం తర్వత యంగ్ హీరోల నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కేవలం చిరు చిత్రం కోసం మాత్రమే పని చేయటంతో ఈ స్దాయి రెమ్యునేషన్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 

ఎంటర్టైన్మెంట్ తో కలిసిన సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.