'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కిందనే చెప్పాలి. ఆ వెంటనే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇప్పుడు ఈ సినిమా విడుదల సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న క్రమంలో ఈ బ్యూటీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో ఆమె స్వయంత్రుప్తి కోసం వైబ్రేతర్ వాడే సన్నివేశంలో దర్శనమిచ్చింది. కియారాని అటువంటి సన్నివేశంలో చూసి అందరూ షాక్ అయ్యారు.

హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉంటే ఇలాంటి సీన్ లో నటించడమేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై స్పందించింది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ''అదంతా కేవలం ఫన్ లో భాగంగా రూపొందించిన సన్నివేశాలే. అదేదో బూతులా భావించాల్సిన పని లేదు.

సెక్స్, కోరికల్ని కూడా చాలా అందంగా చూపించారు. లస్ట్ స్టోరీస్ లో కేవలం సెక్స్ మాత్రమే లేదు.. అంతకు మించిన చాలా విషయాలు ఉన్నాయి'' అంటూ చెప్పుకొచ్చింది. ఇకపై అలాంటి వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.