పెళ్లికి ముందు సెక్స్.. మహేష్ హీరోయిన్ బోల్డ్ కామెంట్!

First Published 28, Jun 2018, 10:54 AM IST
kiara advani bold comments on before marriage sex
Highlights

సెక్స్ అనేది తప్పు కాదు. దాని గురించి ఎవరిని వినిపించకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు

ఎం.ఎస్.ధోని చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కియారా అద్వానీ.. మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలానే బాలీవుడ్ లో 'లస్ట్ స్టోరీస్' అనేఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా తనకు మంచి సువాసన వచ్చే అబ్బాయిలు నచ్చుతారని చెబుతూ పెళ్లికి ముందు సెక్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. 'సెక్స్ అనేది తప్పు కాదు. దాని గురించి ఎవరిని వినిపించకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు 15 ఏళ్ల వయసులో తెలిసిన విషయం ఏంటంటే సెక్స్ అనేది పెళ్లి తరువాతే చేయాలని. అలా ఎందుకు అనేది నాకు అర్ధం కాని విషయం. నా దృష్టిలో అది తప్పే' అంటూ వెల్లడించింది.

మొత్తానికి తన అందంతో పాటు ఇటువంటి బోల్డ్ కామెంట్లు చేస్తూ కూడా యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. 
 

loader