రేప్ చేస్తామంటు బన్నీ ఫ్యాన్స్ ఆమెకు హెచ్చరికలు

Kerala fans threatened her Online for negative reviews
Highlights

 రేప్ చేస్తామంటు బన్నీ ఫ్యాన్స్ ఆమెకు హెచ్చరికలు


నా పేరు సూర్య మూవీ మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మహానటి దెబ్బకు నా పేరు సూర్య కలెక్షన్లకు దెబ్బతిన్నాయి. తెలుగుతో పాటు అల్లు అర్జున్ కు మళయాలంలో కూడా మంచి క్రేజ్ ఉంది. నా పేరు సూర్య ఇక్కడి మాదిరిగానే యావరేజ్ రివ్యూలే వచ్చాయి.అపర్ణ ప్రశాంతి అనే ఓ జర్నలిస్ట్ రాసిన నెగిటివ్ రివ్యూ కారణంగా.. అక్కడి అభిమానులు అనేక మంది ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. రేప్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. 

దీనిపై ప్రశాంతి ఇప్పటికే సైబర్  సెల్ కు కూడా ఫిర్యాదు చేసింది. నిజానికి కేరళలో దాదాపు అందరు రివ్యూ రైటర్ల మాదిరిగానే ఈమె రివ్యూ కూడా ఉంది. కానీ మహిళ కావడంతోనే ఈమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని హీరోలు కూడా ఖండించాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజానికి రివ్యూలు ఓ వ్యక్తి అభిప్రాయం మాత్రమే. అవి సినిమా జయాపజయాలను నిర్ణయించలేవనే విషయం గతంలోనే నిరూపితం అయింది. 


 

loader