Asianet News TeluguAsianet News Telugu

గర్భవతి పాత్రలో కీర్తి సురేష్ !రిస్క్ చేస్తోందా?

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారువారి పాట', మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మరో సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.

Keerthy Suresh Approached For A Bollywood Remake?
Author
Hyderabad, First Published Aug 30, 2021, 11:48 AM IST

ఈ మధ్య కాలంలో వరసగా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కీర్తిని మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా పలకరించబోతోందని సమాచారం. గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్న బాలీవుడ్ సినిమా ‘మిమి’ తెలుగు, తమిళ రీమేక్ వెర్షన్ లో నటించటానికి కీర్తి సురేష్ ని సంప్రదించారని వినికిడి. కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. 

బాలీవుడ్ లో స్టార్ కావాలని కలలు కంటున్న ఓ యువతి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఓ అమెరికన్ దంపతుల కోసం సరోగేట్ మదర్ కావటానికి ఒప్పుకుంటుంది. అయితే పుట్టబోయే బిడ్డ మానసిక వైఫల్యంతో పుడతాడనే రిపోర్ట్ రావటంలో అమెరికన్ జంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దాంతో గర్భం దాల్చిన యువత ఏం చేసింది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టిన బిడ్డను తీసుకువెళ్లడానికి వచ్చిన అమెకన్ జంట ఏ నిర్ణయం తీసుకుందనే అంశంతో ‘మిమి’ తెరకెక్కింది.

ఇది ‘మాలాఆయ్ వ్హయ్చీ’ అనే మరాఠీ సినిమాకి రీమేక్. నిజానికి 2013లో ఇదే సినిమా ‘వెల్కమ్ ఒబామా’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది కూడా. అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. అందుకే కీర్తి స్టార్ డమ్ తో అయినా ఆడుతుందనే అభిప్రాయంతో ఇప్పుడు రీమేక్ చేసే ధైర్యం చేస్తున్నారు.

‘మహానటి’ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ ఖాతాలో సరైన హిట్ పడ లేదు.  హీరోలతో నటించిన సినిమాలో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా  పూర్తిగా నిరాశపరిచాయి. ఒక్క తమిళ ‘సర్కార్’ తప్పిస్తే చెప్పుకోదగ్గ  సినిమా లేదు. ప్రస్తుతం కీర్తి నటించిన ‘మరక్కార్, గుడ్ లక్ సఖి, అన్నత్తే’ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ ‘సాని కాయిదం, వాశి’ సినిమాలతో పాటు తెలుగులో ‘సర్కారువారి పాట, భోళా శంకర్’ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios