మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి  బర్త్ డే సంధర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. కీర్తి సురేష్ ఏడెనిమిదేళ్లు ప్రాయంలో ఉండగా ఒక వేడుకలో హీరో మమ్ముట్టిని కలిశారు. ఆ  ఫోటోలు ట్విట్టర్ లో పంచుకున్న కీర్తి సురేష్ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే లెజెండరీ యాక్టర్, హ్యాండ్ సమ్మె అంకుల్. నిరంతరం మీరు నాకు స్ఫూర్తి పంచారు. మీ వయసు పెరిగేకొద్దీ మరింత యవ్వనంగా మారాలని కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. 

ట్విట్టర్ లో  కీర్తి పంచుకున్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిత్ర పరిశ్రమకు చెందిన కీర్తి సురేష్ కుటుంబానికి తమిళ, మలయాళ పరిశ్రమలతో ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయి. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ దర్శకుడు కాగా తల్లి మేనక హీరోయిన్. తమిళ మలయాళ కుటుంబాలకు చెందిన వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వారి సంతానమే కీర్తి. 

ఇక సౌత్ లో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ తో ముందుకు వెళుతుంది. తెలుగులో ఆమె మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.  గుడ్ లక్ సఖి అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. అలాగే నితిన్ సరసన రంగ్ దే మూవీలో నటిస్తుంది.