బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 2 మొదలైంది. ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ నాని ఈ షోపై అంచనాలను పెంచేశాడు. కంటెస్టంట్స్ ఎంపిక విషయంలో నిర్వాహకులు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొనిఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ షోలో అసలు మసాలానే లేదంటోంది కత్తి కార్తిక.

ఓ ఛానెల్ లో యాంకర్ గా పని చేసే కత్తి కార్తిక్ బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ షో ఆమెకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. అయితే సీజన్ 2 లో మాత్రం తెలంగాణా జానపదం లేక మసాలా ఘాటు తగలడం లేదని కార్తిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రోల్ రైడా అనే కంటెస్టంట్ తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ సీజన్ 1లో ముగ్గురు పోటీదారులను తెలంగాణా ప్రాంతం నుండి తీసుకున్నారని కానీ ఈసారి అలా జరగలేదని అదే కొనసాగి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తను నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చింది.మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా.. తెలంగాణా వాసులకు అవకాశం ఇస్తారేమో చూడాలి!