పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ కామెంట్లు చేయటం ఆపాలంటూ ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ట్వీట్ చేయటంతో తాను సైలెంట్ గానే వున్నానని, అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆగట్లేదని కత్తి మహేష్ ఆరోపిస్తున్నాడు. అంతేకాక సోషల్ మీడియాలో కత్తికి ఏడు ప్రశ్నలంటూ పవన్ ఫ్యాన్స్‌ సంధించిన ప్రశ్నలకు మూవీ క్రిటిక్ బదులిచ్చాడు. తన కుటుంబం ఎవరినీ మోసం చేయలేదని కత్తి స్పష్టం చేశాడు. పవన్ ఫ్యాన్స్ సంధించిన 7 ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన ఉద్యోగ విరమణ చేశాక వచ్చిన సొమ్ముతో మా ఊళ్లోనే, మాకున్న కొద్ది పాటి స్థలంలో ఇల్లు క‌ట్టుకున్నారు. ఆయన కోట్లు మింగారనేది అవాస్తవం అని కత్తి బదులిచ్చాడు.

నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదనే ప్రశ్నకు బదులుగా.. మా ఫ్యామిలీ మా ఊళ్లోనే ఉంటోంది. మా నాన్న అక్కడే ఇల్లు కట్టుకున్నారని చెప్పాడు.

బిగ్ బాస్ అవకాశంపై వచ్చిన ప్రశ్నకు బదులిస్తూ.. బిగ్ బాస్ షోలో తన ఎంట్రీ కోసం వైఎస్సార్‌సీసీ నేత అంబటి రాంబాబు తనకు సహకరించలేదని స్పష్టం చేశాడు. ముంబైకి చెందిన టీం 80 మందిని ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ఎంపిక చేసింది. దానికి, అంబటికి సంబంధం ఏంటని పవన్ ఫ్యాన్స్‌ను కత్తి ప్రశ్నించాడు.

ప‌వ‌న్‌ని టార్గెట్ చేసినందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ముట్టజెప్పిందనే ప్రశ్నకు బదులిస్తూ.. నా కోసం నేను పోరాడుతున్నా. నా ఆత్మ‌గౌర‌వం కోసం ప్ర‌శ్నిస్తోంటే జగన్ పార్టీ నా వెనుక ఉందని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారని కత్తి మండి పడ్డాడు.

మరో ప్రశ్నకు బదులిస్తూ.. మా అమ్మ ఎప్పుడూ చిట్టీలు వేయలేదని కత్తి స్పష్టం చేశాడు. ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయిందని చెప్పాడు. 

నీ సోదరి, భర్త బెదిరించి డబ్బులు గుంజడానికి ఎవరు సాయం చేశారనే ప్రశ్నకు బదులిస్తూ.. మా బావ ఉద్యోగం చేస్తున్నాడు. నా సోద‌రి జీవితం సంతోషంగా సాగుతోంది. న‌న్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాల‌నే ఉద్దేశంతోనే నా కుటుంబంపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని కత్తి వాపోయాడు.

ఇటీవలే సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లానని, మా నాన్న కూడా అదే ఊళ్లో ఉంటున్నారని, కాబట్టి మా కుటుంబం ఎలాంటి తప్పూ చేయకపోతే సంక్రాంతికి సొంతూరికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నే సరైందని కాదని చెప్పాడు. తను వీలైనప్పుడల్లా ఊరికి వెళ్లి వస్తుంటానని చెప్పాడు.