Asianet News TeluguAsianet News Telugu

‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

హీరో మార్చురీ వ్యాన్ డ్రైవర్, హీరోయిన్ ...భర్త చనిపోయి బాధలో ఉన్నామె. వీళ్లిద్దరి మధ్యా లవ్ స్టోరీ ..గమ్మత్తుగానే ఉందే. తెలుగులోనూ కొత్త ఆలోచనలు,కథలు వస్తున్నాయ.. మిస్ కాకూడదు. ఇదే ఆలోచన ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిలో కలుగుతుంది. మరి ఇంతకి `చావు కబురు చల్లగా` సినిమా ఎలా ఉందంటే?

Kartikeya  Chaavu Kaburu Challaga Movie Review jsp
Author
Hyderabad, First Published Mar 19, 2021, 1:27 PM IST

హీరో మార్చురీ వ్యాన్ డ్రైవర్, హీరోయిన్ ...భర్త చనిపోయి బాధలో ఉన్నామె. వీళ్లిద్దరి మధ్యా లవ్ స్టోరీ ..గమ్మత్తుగానే ఉందే. తెలుగులోనూ కొత్త ఆలోచనలు,కథలు వస్తున్నాయ.. మిస్ కాకూడదు. ఇదే ఆలోచన ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిలో కలుగుతుంది. అందులోనూ RX100 లో చాలా నాచురల్ గా నటించిన కార్తికేయ చేసిన సినిమా కావటం, టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉండటం, అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాత ప్రొడక్షన్ కావటంతో ఓ వర్గంలో ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే సినిమా ఆ స్దాయిని అందుకుందా అంటే లేదనే చెప్పాలి. కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగా కేవలం క్యారక్టర్స్ లో కొత్తదనం తప్ప,సినిమా నేరేషన్ లో కథలో పాతదనమే ప్రవహించింది. ఇంతకీ ఈ చిత్రం కథేంటి,ఎక్కడ తడబడింది..ఎక్కడ ఆకట్టుకుంది వంటి విషయాలు చూద్దాం. 

కథేంటి

మార్చురీ వ్యాన్ డ్రైవర్‌ బస్తీ బాలరాజు(కార్తికేయ)కి దుఃఖం, చావు మాటలంటే నచ్చవు. రోజు చావులకు బోయి.. అందరి ఏడుపు చూసి,చూసి..ఏడుపంటేనే చిరాకుపడే స్దితికి చేరుకుంటాడు. దాంతో తనకు నచ్చినట్లు బ్రతకాలని, లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని భావిస్తూంటాడు. తన భావాలకు తగ్గట్లే హ్యాపీగా బ్రతికేస్తున్న అతని జీవితంలో ఓ రోజు మల్లిక (లావణ్య) తారసపడుతుంది.  తన భర్త చనిపోతే ఆమె  ఏడుస్తూంటుంది. అయితే అవన్నీ పట్టని బాలరాజు ఆమెతో ఇమ్మిడియట్ గా ప్రేమలో పడతాడు . అక్కడ నుంచి ఇడియట్ లో రవితేజలా .. మల్లిక ఇంటి దగ్గర, దారిలో, ఆమె నర్స్ గా పనిచేసే హాస్పిటల్లో ఇలా ప్రతి చోటా ప్రేమిస్తున్నానని మల్లిక వెంట వెంటపడతాడు బాలరాజు. ఇరిటేట్ అయిన ఆమె పొమ్మంటుంది. ఈ క్రమంలో పోలీస్ లకు చిక్కి, వాళ్ల చేత ఆమె వెనక పడనని,హెరాస్ చేయనని వార్నింగ్ ఇప్పించుకుంటాడు.

 అయితే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన బాలరాజు డైరక్ట్ గా ఆమె దగ్గరకు వెళ్లి ,అసలు తనతో పెళ్లికు ఎందుకు ఒప్పుకోవటం లేదో అడుగుతాడు. మల్లిక అప్పుడు తాను ఓ మెటర్నిటీ వార్డ్ లో పనిచేస్తానని, ఎంతో మందికి ప్రాణాలు పోస్తానని, జీవితం విలువ తనకు తెలుసు అని అంటుంది.అలాగే బాలరాజు..ప్రాణాలు పోయినవారిని మార్చురీ వ్యాన్ లో తీసుకెళ్తాడని..అతనికి జీవితం విలువ తెలియదని, ఇద్దరి జీవితాలు వేర్వేరు అని,మైండ్ సెట్ లు కలవటం కష్టమని వివరిస్తుంది. బాలరాజు ఆమెను కన్వీన్స్ చేద్దామని చాలా ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ లోగా బాలరాజుకు ఓ విషయం తెలుస్తుంది.

 అతని తల్లి గంగమ్మ(ఆమని) భర్త ఉన్నా వేరే వ్యక్తి మోహన్ (శ్రీకాంత్ అయ్యంగార్)తో అక్రమం సంభంధం పెట్టుకుందని తెలిసి ఓ నిర్ణయం తీుకుంటాడు బాలరాజు. అది తెలుసుకున్న మల్లికలో మెల్లిగా మార్పు వస్తుంది..మనం ప్రెండ్స్ గా ఉందామని చెప్తుంది. ఈ లోగా ఆమె మామగారు (మురళి శర్మ) తన కోడలికి మళ్లీ పెళ్లి చేయాలని ఓ సంభంధం తెస్తాడు. ఆమె ఆయన మాట తీసేయలేక అటు వైపై మ్రొగ్గుతుంది. అప్పుడు బాలరాజు ఏం చేసాడు. తల్లి విషయంలో బాలరాజు తీసుకున్న నిర్ణయం ఏమిటి...చివరికి అతని ప్రేమ కథ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  
ఎనాలసిస్..

చాలా సింపుల్ స్టోరీ లైన్ ఇది. ఇలాంటి కథలు ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తే అంతలా స్క్ర్రీన్ పై ఇంపాక్ట్ చూపుతాయి. మార్చురీ డ్రైవర్, మార్చురీలో పనిచేసేవాడు, శవాల దగ్గర డాన్స్ చేసేవాడు. స్మశానంలో ఉండేవాడు ఇలాంటి క్యారక్టర్స్ తో సినిమాలు తమిళంలో ఎక్కువగా వస్తూంటాయి. మనకు అరుదు అనే చెప్పాలి. కాబట్టే మనకు ట్రైలర్ చూడగానే కొత్తగా అనిపించింది. తమిళంలో అయితే ఇలాంటివి చాలా చూసాంలే అందురేమో. అయితే ఆ కొత్తదనం చివరి దాకా మెయింటైన్ చేస్తే బాగుండేది. కానీ రొటీన్ ఫార్మెట్ ట్రాప్ లోకి వెళ్లిపోయింది స్క్రిప్టు. హీరోయిన్ వెనక ..హీరో పడటం , ఆమె రిజక్ట్ చేయటం, చివరకు ఓకే చేయటం చాలా కామన్ కథలా మారింది. కేవలం సెటప్ మార్చినంతమాత్రాన సినిమా మొత్తం మారిపోతుందనేది భ్రమ అని దర్శకుడు తేల్చేసాడు. 

కథలో కొత్తదనం అంతా హీరోయిన్ విడో, హీరో మార్చురీ డ్రైవర్ దగ్గరే ఆగిపోయింది. మనీ సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగులాగ...క్యారక్టర్స్ ఛేంజ్ ..మిగతాదంతా సేమ్ టు సేమ్. మనకు తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసిపోతూంటుంది. ఫస్టాఫ్ ని ఫన్నీ సీన్స్ తో ఫిల్ చేయటంతో పెద్దగా మనకు ఆ తేడా కనిపించదు. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి రొటీనే అని తెలిసిపోతుంది. దానికి తోడు స్క్రీన్ ప్లే చాలా ప్లాట్ గా ఉంటుంది. సబ్ ప్లాట్ అయిన ఆమెని ట్రాక్ ..పెద్దగా ఆసక్తి రేపలేదు. కథలోనూ పెద్దగా మార్పులు తేలేదు. అయితే ఇది పోగ్రసివ్ లైన్. ఇలాంటి కథలు చెయ్యాల్సిన అవసరం ఉంది. అయితే కథలో పోగ్రిసెవ్ ఎలిమెంట్స్ కూడా అదే స్దాయిలో ఉండాలి. అబ్బాయి..అమ్మాయి ప్రేమ కథలా ఉంటే ఇలాంటి సినిమాలకు విలువ ఏముంటుంది. 

డైరక్షన్,మిగతా విభాగాలు..

కొత్త దర్శకుడు ఈ సినిమాని ఫస్టాఫ్ ఫన్ తో సెకండాఫ్ ఎమోషన్ తో లాక్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే ఎమోషనల్ ఎపిసోడ్స్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. దాంతో సెకండాఫ్ లో కూడా కామెడీ కంటెంట్ ఎక్సపెక్ట్ చేయాల్సి వచ్చింది. దానికి తోడు.., డైరెక్టర్ స్లో నేరేషన్  ఇబ్బందిగా అనిపించింది. ఇక మిగతా విభాగాల్లో డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. కొన్ని హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ డైనమిక్ గా ఉంది. ఇక జేక్స్ బిజోయ్ అందించిన పాటలు కన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్ కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. సీన్స్ లో  చాలా నాచురల్ గా ఉంది.  

నటీనటుల్లో ...బాలరాజుగా కార్తీకేయ రెగ్యులర్ హీరోయిజాలకు భిన్నంగా చేసారు. లావణ్య త్రిపాఠి కూడా తన పాత్ర డీగ్లామర్ గా సహజనటి జయసుథ ని గుర్తు చేసింది. సీనియర్ నటి ఆమని, మురళిశర్మ, శ్రీకాంత్ అయ్యంగారు కీలకమైన పాత్రల్లో బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు. 
 
 
 

ఫైనల్ థాట్
టెంప్లేట్ పాతదైనప్పుడు క్యారక్టర్స్ కొత్తవి తీసుకున్నా పాత సినిమానే ప్రత్యక్ష్యమవుతుంది.

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/ 5


ఎవరెవరు...
 బ్యానర్:  గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి,  మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు
ఎడిటర్ : సత్య . జి
సినిమాటోగ్రాఫర్:  కరమ్ చావ్లా
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్ : జి యమ్ శేఖర్
ప్రొడక్షన్ డిసైనర్ : మనీషా ఏ దత్
కాస్ట్యూమ్ డిసైనర్: మౌన గుమ్మడి
అడిషనల్ డైలాగ్స్ : శివ కుమార్ బొజ్జుల
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ అండ్ భాను
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,మేఘ శ్యామ్
సమర్పణ : అల్లు అరవింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శరత్ చంద్ర నాయుడు ,రాఘవ కరుతూరి
రన్ టైమ్ : 2గం 17 ని
రచన, దర్శకత్వం : కౌశిక్ పెగళ్ళపాటి
నిర్మాత :బన్ని వాస్
రిలీజ్ డేట్:  19 మార్చి 2021

Follow Us:
Download App:
  • android
  • ios