కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీ పూర్తిగా కుదేళయ్యింది. షూటింగ్‌లతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో ఫిలిం స్టార్స్ అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు స్టార్స్. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీ రిప్లైస్‌ ఇస్తున్నారు స్టార్స్‌..

తాజాగా బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా `ఆస్క్‌ మీ ఎనీథింగ్‌` అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు కార్తీక్‌ ఆర్యన్ చెప్పిన సమాధానం ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజెన్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. `నిజానికి పెళ్లి చేసుకోవడానికి ఇది రైట్‌ టైం.. పెద్దగా ఖర్చు కాదు` అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు కార్తిక్‌.

మరో నెటిజెన్‌.. `లాక్‌ డౌన్‌లో మీరు సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్నారట కదా` అంటూ ప్రశ్నించగా.. `ఇలాగే ఉంటే లాక్‌ డౌన్‌లో నాకు పిల్లలు పుట్టారు అన్న వార్తలు కూడా వస్తాయి` అంటూ సరదాగా కామెంట్ చేశాడు కార్తిక్‌ ఆర్యన్‌. బాలీవుడ్‌లో చాక్లెట్‌ బాయ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న కార్తీక్‌ ఆర్యన్ ప్రస్తుతం బూల్‌ బులయ్యా 2, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడ్డాయి.