Asianet News TeluguAsianet News Telugu

రిలీజ్ కు ముందే 'కార్తికేయ 2' సాలిడ్ బిజినెస్, బాంబ్ లాంటి ధర.. లాభాలు పక్కా ?

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హ్యాపీ డేస్, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వెర్సస్ సూర్య లాంటి విభిన్నమైన చిత్రాలతో నిఖిల్ హిట్స్ దక్కించుకున్నాడు.

karthikeya 2 satellite rights sold for big amount
Author
Hyderabad, First Published Sep 3, 2021, 11:40 AM IST

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హ్యాపీ డేస్, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వెర్సస్ సూర్య లాంటి విభిన్నమైన చిత్రాలతో నిఖిల్ హిట్స్ దక్కించుకున్నాడు. మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాల్లో నిర్మాతలకు నిఖిల్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. 

కార్తికేయ, దర్శకుడు చందూ ముండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయం సాధించింది. డివోషనల్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ చిత్రం ఇప్పటికి బుల్లితెరపై ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. 

ప్రస్తుతం కార్తికేయ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రం సాలిడ్ బిజినెస్ మొదలు పెట్టింది. 

తాజా సమాచారం మేరకు ప్రముఖ ఛానల్ ఈచిత్ర శాటిలైట్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ 20 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. నిఖిల్ చిత్రానికి ఇది రికార్డ్ అమౌంట్ అనే చెప్పాలి. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ డీల్ తో నిర్మాతలకు లాభాలు పక్కా అనే వార్తలు వస్తున్నాయి. కార్తికేయ 2 మీడియం బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం. తాజా డీల్ తో సగానికి పైగా పెట్టుబడి నిర్మాతకు వచ్చేసినట్లే. రిలీజ్ అయ్యాక కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ప్రొడ్యూసర్స్ కి కాసుల పంట గ్యారెంటీ. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్ కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం గ్రీస్ దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ పూర్తవుతుందట. 

Follow Us:
Download App:
  • android
  • ios