మొత్తానికి నిఖిల్ కార్తికేయ సీక్వెల్ ని స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ చందు మొండేటి గత కొన్నాళ్లుగా ఈ సినిమా కథ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఫైనల్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తం షాట్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. సినీ ఫీల్డ్ లో ఎంత సక్సెస్ లో ఉన్నా కొన్నిసార్లు ప్లాప్ లు నేలకేసి కొట్టేస్తాయి.

అలాంటి పరిస్థితుల్లో కథలను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం యువ హీరో నిఖిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటు తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు.  అయితే కిర్రాక్ పార్టీ అనంతరం నిఖిల్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇటీవల విడుదలైన అర్జున్ సురవరం కూడా మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ విడుదల అనంతరం కొంత బూస్ట్ ఇచ్చింది.

అయితే  నెక్స్ట్ సినిమా కార్తికేయ 2తో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. మొన్నటి వరకు సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు ఫైనల్ గా సినిమాని స్టార్ట్ చేశారు. ఇక సీక్వెల్ కథలో ట్విస్ట్ లు అలాగే థ్రిల్లింగ్ గా అనిపించే సీన్స్ ఎవరు ఊహించని విధంగా ఉండాలని హీరో దర్శకుడితో ఇన్ని రోజులు సమయాన్ని లెక్క చేయకుండా చర్చించాడు.  వీలైనంత త్వరగా  సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ దర్శకుడు చందు మొండేటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక హీరోయిన్ గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' లో నటించిన శృతి శర్మను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్.