Asianet News TeluguAsianet News Telugu

కార్తీక దీపం : దేవుడి వద్ద కంటతడి.. అక్కడ మాత్రం సైకోలా.. కార్తీక్ ని కట్టేసి మోనిత ఏం చేసిందంటే

బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా, ఎమోషనల్ గా మరీనా సంగతి తెలిసిందే. కార్తీక్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

Karthika deepam episode 1131 highlights
Author
Hyderabad, First Published Aug 30, 2021, 7:03 PM IST

బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా, ఎమోషనల్ గా మరీనా సంగతి తెలిసిందే. కార్తీక్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతడిని విడిపించేందుకు దీప కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం 1131వ ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం. 

జ్వరం కారణంగా పడుకుని ఉన్న సౌర్యకు దీప పడుతున్న కష్టాల గురించి సౌందర్య వివరిస్తుంది. దీంతో సౌర్య ఏడుస్తూ నాకు అమ్మ మీద కోపంగానే ఉంది అని అంటూ ఉంటుంది మరోవైపు మోనిత కార్తీక్ ని ఎలాగైనా దక్కించుకోవాలి అనే ఆలోచనతో సైకోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. 

దేవుడి ఫోటో వద్ద తాను చేస్తున్నది తప్పే అని.. కానీ కార్తీక్ కోసం తప్పడం లేదు అని కంటతడి పెట్టుకుంటుంది. ఇదిలా ఉండగా దీప సౌర్యకు టాబ్లెట్ ఇవ్వడానికి వస్తుంది. ఇక్కడ సౌర్య, దీప మధ్య ఎమోషనల్ సీన్ నడుస్తుంది. అమ్మా నన్ను ఇప్పటివరకు అబద్దాలతోనే పెంచావ్.. ఇప్పుడూ అబద్దాలే చెబుతున్నావ్. ఇకనైనా ఆపు.. టాబ్లెట్ నేను వేసుకుంటాను నువ్వు వెళ్ళు అని పక్కకు తిరిగి పడుకుంటుంది సౌర్య. దీనితో దీప బాధతో బయటకు వచ్చేస్తుంది. 

మరోవైపు పోలీస్ కస్టడీలో ఉన్న కార్తీక్ కు కడుపు నొప్పి మొదలవుతుంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ రత్న సీత ఇది గమనిస్తుంది. దీనితో మోనిత చేసిన నిర్వాకాన్ని ఆమె గుర్తు చేసుకుంటుంది. వద్దంటున్నా ఆ మోనిత గారు టీలో సార్ కి ఏదో కలిపి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు కడుపు నొప్పి మొదలయింది అనుకుంటూ పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ కి చెబుతుంది. 

దీనితో ఎస్ఐ, కానిస్టేబుల్, రత్నసీత కలసి కార్తీక్ ని ఆసుపత్రికి తీసుకెళతారు. దీప కూడా ఆసుపత్రికి వెళుతుంది. రత్నసీత డాక్టర్ ని పిలుచుకురావడానికి వెళ్లగా అక్కడ డాక్టర్ కేబిన్ లో ఉన్న మోనితని చూసి ఆశ్చర్యపోతుంది. కార్తీక్ ఉన్న రూమ్ కి వెళతారు. రత్నసీత తన ఉద్యోగం పోతుందేమోనని భయపడుతుండగా.. నాకు గాయం చేసిన వాళ్ళతో పాటు.. సాయం చేసిన వాళ్ళు కూడా గుర్తుంటారు.. భయపడకు నేను చూసుకుంటాను అని హామీ ఇస్తుంది మోనిత. 

కార్తీక్ రూమ్ లోకి మోనిత మాస్క్ పెట్టుకుని వెళుతుంది. కార్తీక్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆక్సిజన్ పెడుతుంది. మరోవైపు కార్తీక్ ని చూడాలని తపన పడుతున్న దీపని పోలీసులు ఎంటర్ కానివ్వరు. 

ఇక మోనిత నెమ్మదిగా కార్తీక్ ని మత్తులో నుంచి లేపుతుంది. కార్తీక్ లేచి చూసుకునే సరికి అతడి చేతలు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. నిన్ను కట్టేసింది నేనే మోనితా కార్తీక్ ని అంటూ మాస్క్ తీస్తుంది. దీనితో కార్తీక్ కు కోపం వస్తుంది. నన్ను చంపేయాలని ఉందా..చేతులు కట్టేశాను.. అరవాలని ఉందా..నోటికి ప్లాస్టర్ వేశాను.. అంటూ కార్తీక్ పక్కనే కూర్చుంటుంది. అంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.  . 

Follow Us:
Download App:
  • android
  • ios