రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు : రష్మి

First Published 18, Apr 2018, 10:42 AM IST
Karnataka RJ Rashmi gets threat
Highlights

రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు : రష్మి

సామాజిక మాధ్యమాలు వేదికగా తనను కించపరిచేలా దూషిస్తూ, రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని  కర్ణాటకకు చెందిన రేడియో జాకీ (ఆర్జే) ర్యాపిడ్ రష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాష్ట్రంపై, కన్నడ వాసులపై తానెన్నడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కొందరు కించపరిచే కామెంట్లు చేయడం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. 

కాగా, రేడియో షోలో భాగంగా ఇటీవల విడుదలైన కన్నడ సినిమా ‘రాజారథ’ దర్శకుడు అనూప్ భండారీ, ఆయన సోదరుడు, హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టితో ర్యాపిడ్ రష్మీ ఫోన్ లో మాట్లాడింది. ‘ఈ సినిమా చూడని వారిని ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు ప్రేక్షకులను కించపరిచే విధంగా అనూప్, హీరోహీరోయిన్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ర్యాపిడ్ రష్మీపై నెటిజన్లు విరుచుకుపడటమే కాకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ, రేప్ చేస్తామని బెదిరింపులు చేస్తున్నారు.

loader