సన్నిలియోన్ బయోపిక్ ట్రైలర్.. ఎవరికీ తెలియని నిజాలు

Karenjit Kaur: The Untold Story of Sunny Leone trailer
Highlights

 ఓ వ్యక్తి సన్నీలియోన్ను ఇంటర్వ్యూ చేసే సీన్ నుండి మొదలుపెట్టిన ఈ ట్రైలర్ లో ఆమె చిన్నతనం, ఇండియా నుండి కెనడాకు షిఫ్ట్ అయిన తన తల్లితండ్రులు, ఇంట్లో ఆర్ధిక సమస్యలు, మోడలింగ్ మొదలుపెట్టిన అడల్ట్ సినిమాలలో నటిగా కెరీర్ ఆరంభించడం ఆ తరువాత బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ వంటి సన్నివేశాలతో ట్రైలర్ సాగింది

పోర్న్ స్టార్ గా మాత్రమే అందరికీ తెలిసిన సన్నిలియోన్ ఏ కారణాల వలన అలా ఆవాల్సివచ్చింది..? ఆమె తన జీవితంలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూసిందో ఇప్పుడు ప్రేక్షకులందరికీ చెప్పడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు కరణ్ జీత్  కౌర్. 'ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' అనే పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ఓ వ్యక్తి సన్నీలియోన్ ను ఇంటర్వ్యూ చేసే సీన్ నుండి మొదలుపెట్టిన ఈ ట్రైలర్ లో ఆమె చిన్నతనం, ఇండియా నుండి కెనడాకు షిఫ్ట్ అయిన తన తల్లితండ్రులు, ఇంట్లో ఆర్ధిక సమస్యలు, మోడలింగ్ మొదలుపెట్టిన అడల్ట్ సినిమాలలో నటిగా కెరీర్ ఆరంభించడం ఆ తరువాత బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ వంటి సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ఇంట్లో ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగానే ఆమెన అడల్ట్ సినిమాలలో నటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చూపించారు. 19 ఏళ్ల వయసులోనే పెంట్ హౌస్ అనే మెన్స్ మ్యాగజైన్ లో ఆమె కవర్ పేజ్ లో కనిపించడం వంటి విషయాలను కూడా టచ్ చేశారు.

ట్రైలర్ ను మాత్రం ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఇంపాక్ట్ చూపిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ కు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలోకూడా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో 'వీరమహాదేవి' అనే సినిమాను రూపొందిస్తున్నారు.  

 

loader