బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కరాటే కళ్యాణి రెండవ వారమే షో నుండి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో కరాటే కల్యాణే గడిపింది కొద్దిరోజులే. ఐతే ఇంటి సభ్యులతో కరాటే కళ్యాణి ఇమిడిపోయినట్లు కనిపించలేదు. వయసులో పెద్దది అయినా కూడా ప్రతి చిన్న విషయానికి పెద్దగా ఏడ్చేస్తూ, అరవడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చినట్లు లేదు. దీనితో ఆమెను త్వరగానే హౌస్ నుండి ప్రేక్షకులు బయటికి పంపించేశారు. ఐతే కరాటే కళ్యాణి కనీసం నాలుగైదు వారాలు హౌస్ లో కొనసాగుతుందని భావించారట. 

లాక్ డౌన్ కావడంతో షూటింగ్స్ లేవు, అలాగే కొంచెం ఫేమ్ తెచ్చుకోవడానికి ఇది సరైన ప్లాట్ ఫార్మ్, అందుకే కళ్యాణి బిగ్ బాస్ హౌస్ కి రావడం జరిగిందని ఆమె చెప్పారు. కాగా కరాటే కళ్యాణి ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన సీజన్ వన్ లోనే పాల్గొనాల్సి ఉందట. మొదటి సీజన్ కొరకు ఎంపిక చేయబడ్డ కంటెస్టెంట్స్ లో కరాటే కళ్యాణి కూడా ఉన్నారట. 

ఐతే మొదటి సీజన్ కావడంతో బెస్ట్ కంటెస్టెంట్స్ కోసం నిర్వాహకులు చివరి వరకు హోల్డ్ లో పెట్టారట. ఎంపికైన వారిలో బాగా తెలిసిన సెలెబ్రిటీలను తీసుకోవాలని అనుకున్నారట. అలాగే కరాటే కళ్యాణి హౌస్ లోకి వస్తే మేము షోలో పాల్గొనం అని కొందరు కంటెస్టెంట్స్ అన్నట్లు తనకు తెలిసిందని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.