మహిళపై లైంగిక దాడి చేసిన వ్యవహారంలో టీవీ నటుడు కరణ్ ఒబేరాయ్ కటకటాల లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం   ప్రయత్నించిన కరణ్ ప్రయత్నాలకు బాంబే హైకోర్టు ఎట్టకేలకు ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

14 రోజులుగా రిమాండ్ లో ఉన్న కరణ్ పై ఐపీసీ సెక్షన్ 376.. 384 కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ప్రయత్నించారు.కరణ్ ప్రయత్నాలు ఫలించి.. తాజాగా ముంబయి హైకోర్టు రూ.50వేల పూచికత్తు మీద బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేసు వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన ప్రకారం.. 2016 నుంచి బాధితురాలితో కరణ్ ఒబేరాయ్‌కి పరిచయం ఉంది. వారిద్దరు డేటింగ్ మొబైల్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. మోసం చేసాడడు. పెళ్లి పేరుతో బలవంతంగా ఆమెను శారీరకంగా వాడుకొన్నాడు. ఆమెపై రేప్ చేసిన అతను ఆ వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించాడు. ఆ తర్వాత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వీడియోను రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. భాదితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు వెల్లడించారు. 

అయితే ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని  కరణ్ కొట్టి పారేసాడు..  నా వెర్షన్ కూడా పోలీసులు వినాలి అని కరణ్ ఒబేరాయ్ కోరాడు. యాప్ చాటింగ్‌పై విచారణ చేపట్టాలి.  ఇదిలా ఉండగా, కరణ్ తరఫు లాయర్ బెయిల్ కోసం ప్రయత్నించి సాధించారు.  డేటింగ్ యాప్ ద్వారానే ఆమె తన క్లయింట్‌ కరణ్‌కు చేరువైంది. ఛాటింగ్ వ్యవహారాన్ని బయటపెడితే మహిళ స్వరూపం తెలుస్తుంది అని లాయర్ ఆరోపణలు చేశాడు.