కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేది,సంజనలని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇంకా లోతుగా విచారించి రీసెంట్ గా  ప్రముఖ కొరియోగ్రాఫర్ ABCD సినిమాలో డాన్సర్‌గా నటించిన కిషోర్ అమన్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో కిషోర్ తో బాగా టచ్ లో ఉంటు,అతని పార్టీల్లో పాల్గొన్న ప్రముఖ టీవీ యాంకర్ అనుశ్రీకు కూడా సమన్లు పంపారని సమాచారం.

మంగుళూరు పోలీస్ లు రాత్రి తొమ్మిదిన్నరకు ఈ సమన్లను పర్శనల్ గా ఆమెకు సర్వ్ చేసారని చెప్తున్నారు. ముఖ్యంగా కిషోర్ ఏర్పాటు చేసిన పార్టీలలో అనుశ్రీ స్టార్ ఎట్రాక్షన్ గా ఉంటూ వచ్చారు. ఆ పార్టీలలో డ్రగ్స్ వాడారని ఆరోపణలతోనే కిషోర్ ని అరెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలో ఆ డీలింగ్స్ గురించి ఖచ్చితంగా ఆమెకు తెలిసే ఉంటాయని భావించి, ఇంటరాగేట్ చేయబోతున్నారు. ఈ విషయం తెలిసిన టీవి మీడియా షాక్ కి గురైంది.  
 
మరో ప్రక్క కర్ణాటక డ్రగ్స్ కేసు  విచారణ కొనసాగుతోంది.. ప్రముఖ నటుడు దిగత్ ను మరోసారి విచారించిన పోలీసులు.. అతను ముంబాయి, గోవా, శ్రీలంక, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విందులకు హాజరైనట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ లో ఉన్నవారు దిగత్ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన భార్య, నటి ఐంద్రిత రాయ్ తో కలిసి విచారణకు హాజరయ్యారు.. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని దిగత్ కు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే మరో నలుగురు బుల్లితెర నటులను కూడా ఐఎస్డి అధికారులు విచారించారు.