మన దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గంట గంటకూ బయిటపడుతున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీపై పంజా విసిరింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న  ధ్రువ సర్జా కరోనావైరస్ బారినా పడ్డారు. 

ధ్రువ సర్జాకి కరోనా లక్షణాలు కనిపించడంతో అయన టెస్టులు నిర్వహించుకున్నారు. ఈ రిపోర్ట్ లో ఆయనకి కరోనా పాజిటివ్ అని నిర్ధరాణ అయింది.ఈ విషయాన్ని ధృవ్ స్వయంగా ట్వీట్టర్ వేదికగా తెలిపారు. ‘గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపించడంతో మేము టెస్టులు చేసుకోగా.. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందనీ, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసుకోవాలని పిలుపునిచ్చారు’ ధృవ్.

 దీంతో ఆయన డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ధ్రువ సర్జా ఎవరో కాదు.. యాక్షన్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు, అంతేకాకుండా ఒక నెల క్రితం గుండెపోటు కారణంగా మరణించిన చిరంజీవి సర్జాకి స్వయానా తమ్ముడు. 

ధృవ సర్జాకు కరోనా పాజిటివ్ సోకడంతో అక్కడి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు.. ప్రస్తుతం అతని ఇంటిని బిబిఎంపి అధికారులు మూసివేశారు. సర్జా దంపతులు ఇటీవలి రోజుల్లో తమతో పరిచయం ఉన్న వారందరినీ కరోనా పరీక్షించుకోవాలని సూచించారు.