ప్రస్తుతం ఓ వైపు బాలీవుడ్‌లో, మరోవైపు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో పెద్ద దుమారమే రేపుతుంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి దాదాపు 25 మంది సెలబ్రిటీల పేర్లు తెలపగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, సైమోన్‌  ఖంబట్టా పేర్లని టైమ్స్ నౌ మీడియా సంస్థ బయటపెట్టింది. 

దీనిపై నార్కొటిక్‌ సంస్థ ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కంగనాకి చెందిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. తాను కెరీర్‌ ప్రారంభంలో మాదక ద్రవ్యాల బానిసని అని చెబుతున్న వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోని కంగనా ఈ ఏడాది మార్చిలో నవరాత్రి సమయంలో పంచుకుంది. 

ఇందులో కంగనా చెబుతూ, తాను పదిహేనేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయానని, ముంబయి వచ్చి నటిగా మారానని తెలిపింది. హీరోయిన్‌గా మారిన టైమ్‌లో తాను డ్రగ్స్ కి బానిసయ్యిందట. ఆ టైమ్‌లో తన జీవితంలో చాలా విషయాలు జరిగాయట. తాను తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడ్డానని తెలుసుకుందట. ఆ టైమ్‌లో తాను ఎంత ప్రమాదకారిగా ఉందో తెలుసుకుని రియలైజ్‌ అయ్యిందట. 

ప్రస్తుతం డ్రగ్స్ కేసు,సుశాంత్‌ కేసు విషయంలో కంగనాకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వీడియో మరోసారి బయటకు రావడం కలకలరం సృష్టిస్తుంది. ఇదే ఛాన్స్ గా భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై కంగనాని విచారించాలని ఆదేశించింది. మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మొత్తంగా డ్రగ్స్ కేసులో వరుసగా హీరోయిన్ల పేర్లు మాత్రమే బయటపడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.