మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భేటీ అయ్యారు. ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేతతో పాటు బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాలపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భేటీ తర్వాత కంగన హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లనున్నారు.

అంతకుముందు భారీ బందోబస్తు మధ్య కంగన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మార్గమధ్యంలో శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు మొద‌లు కంగ‌నాకు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో కంగ‌నా ముంబైని పీఓకేతో పోల్చ‌డం, బీఎంసీ అధికారులు కంగ‌నా ఆఫీసును పాక్షికంగా‌ కూల్చివేయ‌డం వంటి ఎన్నో ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమెను ముంబైలో అడుగుపెట్టనీయమని శివసేన బెదరింపులకు దిగింది.

అయినా.. ఎవరి బెదిరింపులకు వెరవకుండా కంగనా ముంబైలో లాండ్ అయింది. ఆమెకు వివిధ వ్యక్తులు.. పార్టీల నుంచి థ్రెట్ ఉందని కేంద్రానికి మొరపెట్టుకోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆమెకు  ‘వై’  కేటగిరీ భద్రత కల్పించింది.