Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద హీరోయిన్‌.. 48 కోట్లతో కాస్ట్‌లీ ఆఫీస్

ఇటీవల నిర్మాతగా మారిన కంగనా ఏకంగా 48 కోట్ల ఆఫీస్‌ను నిర్మించుకుంది. టాప్‌ ప్రొడ్యూసర్లు కూడా లేనంత భారీ స్థాయిలో ఆఫీస్‌ను నిర్మిస్తోంది కంగనా రనౌత్‌. సొంతంగా ఓ ల్యాంగ్ తీసుకొని తానే దగ్గరుండి ఆఫీస్‌ బిల్డింగ్‌ను డిజైన్‌ చేసింది.

Kangana Ranaut luxury office cum studio worth Rs 48 crore
Author
Hyderabad, First Published May 30, 2020, 4:07 PM IST

తన సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కంగనా రనౌత్‌. హీరోయిన్‌గా సత్తాచాటుతూనే దర్శకురాలిగా నిర్మాతగానూ సత్తా చాటుతోంది కంగనా. తాజాగా ఈ భామ మరో సంచలనానికి తెర తీసింది. ఇటీవల నిర్మాతగా మారిన కంగనా ఏకంగా 48 కోట్ల ఆఫీస్‌ను నిర్మించుకుంది. టాప్‌ ప్రొడ్యూసర్లు కూడా లేనంత భారీ స్థాయిలో ఆఫీస్‌ను నిర్మిస్తోంది కంగనా రనౌత్‌. సొంతంగా ఓ ల్యాంగ్ తీసుకొని తానే దగ్గరుండి ఆఫీస్‌ బిల్డింగ్‌ను డిజైన్‌ చేసింది..

ప్రస్తుతం ఈ ఆఫీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్‌ మాట్లాడుతూ `నేను కేవలం రూ. 1500 తో ఇంటి నుంచి బయటకు వచ్చాను. నా స్వశక్తితో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాన`ని తెలిపింది. డబ్బు సంపాదించడానికే ఇంటి నుంచి ముంబైకి వచ్చాను. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదించడానికి వారు భరించలేరని చెప్పింది. నేను ఎన్నో పోరాటల తరువాత  స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగానని చెప్పింది.

అంతేకాదు తనకు 50 ఏళ్ల వయసు వచ్చే సరికి తను అందరికంటే ధనవంతురాలిని కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. కంగనా కొత్తగా నిర్మించిన ఆఫీస్‌ లో స్టోరీ డిస్కషన్స్‌తో పాటు వీడియో మేకింగ్, ఎడిటింగ్‌, యాడ్‌ షూట్స్‌ లాంటి అన్ని కార్యక్రమాలు ఒకేచోట జరిగేలా ఏర్పాట్లు చేసింది. అద్బుతమైన ఇంటీరియర్స్, గ్రీనరీతో పాటు వాల్ పెయింటిగ్స్ విషయంలో కూడా కంగనా తన టేస్ట్ తెలిసేలా చాలా జాగ్రత్తలు తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios