బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్, నటుడుఆదిత్యపంచౌలీ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు.  గత కొంత కాలంగా సాగుతున్న ఈ వివాదం పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కింది. ముంబైలోని  వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో కంగనా, ఆదిత్యాపంచోలి ఒకరిపై ఒకరు ఈ రోజు కంప్లైంట్  చేసుకున్నారు.

ఆదిత్యాపంచోలి గతంలో కంగనారనౌత్‌పై వేధింపులకు పాల్పడ్డాడని కంగనా సోదరి రంగోలీ వెర్సోవా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమంయలో కంగనా తరపు లాయర్ తనను అత్యాచార కేసులో ఇరికిస్తానని తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆదిత్యాపంచోలి పీఎస్‌లో కౌంటర్ అప్లికేషన్ దాఖలు చేశాడు. 

ఆదిత్యా పంచోలి మాట్లాడుతూ... కంగనాపై పరువు నష్టం దావా కేసు వేశాను. ఆ కేసును విత్ డ్రా చేసుకోకపోతే నన్ను రేప్  కేసులో ఇరికిస్తానని జనవరి 6న కంగనా తరపు లాయర్ బెదించారని  ఆరోపించాడు.

అలాగే  ఏప్రిల్ ఇరవై ఐదున పోలీసులు నోటీసులతో నా వద్దకు రావడం చూసి ఆశ్చర్యమేసింది. కంగనా లాయర్‌తో మీటింగ్ జరిగినప్పుడు తీసిన 18 నిమిషాల నిడివి గల వీడియోను ఇప్పటికే కోర్టుకు సాక్షాధారంగా సమర్పించానని ఆదిత్యాపంచోలి చెప్పారు. ఇద్దరు వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత..విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని వెర్సోవా పోలీస్ అధికారి తెలిపారు.

అందుతున్న సమాచారం మేరకు రంగోలి ...ఈ వివాదంలోకి ఆదిత్యా పంచోలి భార్య జరీనాని కూడా లాగింది. ఆమెకు అన్ని విషయాలు తెలుసు అని ఆ కంప్లైట్ లో రాసింది. ఈ విషయమై రంగోలిని మీడియావారు కలిస్తే..ఈ విషయమై ఈ సమయంలో తాను మాట్లాడాలనుకోవటం లేదని తేల్చి చెప్పింది.