Asianet News TeluguAsianet News Telugu

భారతీయుడు 2 :ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌, నిజమైతే లాభాల పంటే

 ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ..’ఇండియన్ 2′ సినిమా రూపుందున్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Kamal Haasan Bharateeyudu 2 to be released in two parts?
Author
Hyderabad, First Published May 14, 2020, 10:27 AM IST


 అప్పట్లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘భారతీయుడు’.అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసిన పోరాటం ప్రజలను ఎంతగానో మెప్పించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంంలో  ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అనుకోని విధంగా క్రేన్ తో  ప్రమాదం జరగటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా పరిస్దితి ఏమిటనేది పెద్ద కన్ఫూజన్ గా మారింది. 
  
మరో ప్రక్క ఇది చాలదన్నట్లు కరోనా ప్రభావంతో పెద్ద సినిమాలు వణుకుతున్నాయి. రిలీజ్ చేస్తే రికవరీ ఉంటుందో లేదో తెలియదు. ఈ క్రమంలో ఆ చిత్రం టీమ్ ...నష్టాలు నుంచి తప్పించుకోవటానికి సినిమాని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇప్పటి ఏదీ ఫైనల్ కాలేదు. ఓకే అనుకుంటే స్క్రిప్టులో మార్పులు చేసి,లెంగ్త్ పెంచాలని భావిస్తున్నారట. ఈ ఐడియాని కమల్ ఇచ్చారట. తను రెండు పార్ట్ లుగా విడతీయబట్టే విశ్వరూపం విషయంలో ఫైనాన్సియల్ గా ఇబ్బందులు పడలేదని చెప్పారట.  

ఇక  స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కాజల్ ...తాజాగా భారతీయుడు2 సినిమాలో కీ రోల్ చేస్తోంది. కమల్ హాసన్ సరసన చేస్తున్న ఆమె పాత్ర నెగిటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. కమల్ కు ఆమె చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఈ పాత్రను అసలు ఎవరూ ఊహించలేని విధంగా డిజన్ చేసారని చెప్తున్నారు. ఆమెకు 85 సంవత్సరాలు ఉంటాయి కానీ ఆమె దుర్మార్గురాలిగా కనిపించబోతోందని చెప్తున్నారు.

  ఇక  సినిమా కోసం కాజల్‌ వర్మ కళ అనే విద్యను నేర్చుకున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్‌ చిత్ర వర్గాలు వెల్లడించాయి. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios