‘నా నువ్వే’ ట్విట్టర్ రివ్యూ

kalyan ram and tamanna starrer na nuvve twitter review
Highlights

రోమాంటిక్ లవ్ స్టోరీ


నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారిగా నటించిన పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం ‘ నా నువ్వే’. మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జంటగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను బాగా పెంచేశాయి. 

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. కాగా.. ఈ సినిమా ఈ రోజు( జూన్ 14) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే సినిమాని చూస్తున్న కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వారి ట్వీట్ల ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. అద్భుతంగా ఉందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. సినిమా చాలా కూల్‌గా ఉందని.. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందంటున్నారు. 

స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు సినిమాకి పాజిటివ్ టాకే వినపడుతోంది. పూర్తి స్థాయి రివ్యూ కావాలంటే మరికొద్ది సేపు వేచిచూడాల్సిందే. 

loader